Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత, నాగచైతన్య అస్సలు తగ్గట్లేదుగా..!

సమంత, నాగచైతన్య అస్సలు తగ్గట్లేదుగా..!

నాగచైతన్య, సమంతకు నిశ్చితార్థం జరిగి చాన్నాళ్లయింది. అయితే ఆ విషయాన్ని వాళ్లిద్దరూ మరిచిపోయినట్టున్నారు. పెళ్లి గురించి ఆలోచన లేకుండా సినిమాలతో సహజీవనం చేస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ చెరో 2 సినిమాలు ఒప్పుకున్నారు. అవి పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ చైతూ, సమంత ఇప్పుడు మరిన్ని సినిమాలకు సైన్ చేస్తున్నారు. పెళ్లి సంగతే పట్టించుకోకుండా సెట్స్ పైనే గడిపేస్తున్నారు.

కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య చేస్తున్న "రారండోయ్ వేడుక చూద్దాం" షూటింగ్ కంప్లీట్ అయింది. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో చేస్తున్న సినిమా దాదాపు 80శాతం కంప్లీట్ అయింది. ఈ రెండూ చాలవన్నట్టు చందు మొండేటి చెప్పిన ఓ కథకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతూ. ఇదిలా వుంటే ప్రేమమ్ సినిమా చేసిన సితార ఎంటర్ టైన్ మెంట్స్, చైతూతోనే మరో సినిమా చేయాలని చూస్తోంది. ఈ కథకు కూడా చైతూ ఓకే చెబితే.. ఈ రెండు ప్రాజెక్టులు జులై నుంచి సెట్స్ పైకి వస్తాయట. ఆ రెండూ కంప్లీట్ అవ్వడానికి కనీసం 6-7 నెలలైనా పడుతుంది. మరి అప్పటివరకు నాగచైతన్య పెళ్లి చేసుకోడా..?

ఇటు సమంత కూడా తక్కువేం కాదు. ప్రస్తుతం నాగ్ తో రాజుగారి గది-2, రామ్ చరణ్ తో ఓ సినిమాకు కాల్షీట్లు కేటాయించిన సమంత.. త్వరలోనే మహానటి సినిమా స్టార్ట్ చేయబోతోంది. అటు తమిళనాట ఇప్పటికే విజయ్ 61వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. విశాల్ కొత్త సినిమాలోనూ నటించే అవకాశముంది. 

నాగచైతన్య, సమంత ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీ అయిపోయారు. ఓ వైపు నాగార్జున వీళ్ల పెళ్లిని వీలైనంత తొందరగా జరిపించాలని చూస్తుంటే, వీళ్లు మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో వీళ్లు పెళ్లిచేసుకుంటారని మొన్నటివరకు ప్రచారం సాగింది. వీళ్ల దూకుడు చూస్తుంటే అసలు ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా అనే అనుమానం కలుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?