Advertisement


Home > Movies - Movie Gossip
చైతూ సరసన నితిన్ లవర్?

లై సినిమాలో నితిన్ ప్రియురాలిగా కనిపించింది మేఘా ఆకాష్. ఆ సినిమానే తొలి సినిమా. మేఘా ఆకాష్ మలయాళీ అయినా తెలుగు మూలాలు వున్న అమ్మాయి. స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే వుంటుంది. ఇప్పుడు అదే అమ్మాయి, అదే నితిన్ తో రెండో సినిమా కూడా చేస్తోంది.

నితిన్ ఇలా రెండో చాన్స్ ఇవ్వడం వెనుక, ఆఫ్ ది స్క్రీన్ కూడా ఆమెను అమితంగా ఇష్టపడుతున్నాడని గుసగుసలు వున్నాయి. ఆ గుసగుసలు ఎంతవరకు వున్నాయి అంటే నితిన్ ఆమెను పెళ్లి చేసుకుంటాడేమో అనేంత వరకు. సరే, అదంతా వేరే సంగతి.

ఇదిలా వుంటే నాగ్ చైతన్యతో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలో సెట్ మీదకు వెళ్లబోయే ఈ సినిమా కోసం హీరోయిన్ వెదుకులాట ప్రారంభమైంది. పూజా హెగ్డే, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ ల పేర్లు షార్ట్ లిస్ట్ లోకి వచ్చినట్లు వినికిడి.

వీరిలో పూజా హెగ్డేను చైతూ-చందు మొండేటి సినిమా కోసం అడుగుతున్నారని వార్తలు వచ్చాయి. అను ఇమ్మాన్యుయేల్ మరీ అంత గ్లామరస్ ఫిగర్ ఏమీ కాదు. అందుకే ఇక మిగిలిన ఛాయిస్ మేఘా ఆకాష్ అని వినిపిస్తోంది. చూడాలి ఏం డెసిషన్ తీసుకుంటారో?