Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చలపతి ఎఫెక్ట్.. ఆ డైలాగ్ కట్?

చలపతి ఎఫెక్ట్.. ఆ డైలాగ్ కట్?

చలపాయ్ చపలత్వానికి రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఇబ్బందుల్లో పడింది. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళలపై చలపతిరావు చేసిన బుద్ధితక్కువ వ్యాఖ్యలతో నాగార్జునకు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి. చలపతిరావు కామెంట్స్ ను మీడియా సాక్షిగా ఖండించిన నాగ్.. తనే దగ్గరుండి యూనిట్ లో అందరి చేత ఖండనలు ట్వీట్ చేయించాడు. అసలు ఈ మొత్తం వివాదానికి కారణం సినిమాలోని ఆ డైలాగ్.

అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అని నాగచైతన్య చెబుతాడు. సినిమాలో అది ఏ సందర్భంలో వస్తుందో తెలీదు కానీ, ట్రయిలర్ లో మాత్రం ఫినిషింగ్ టచ్ గా దాన్ని చూపించారు. అదే డైలాగ్ ను లీడ్ గా తీసుకొని ఆడియో ఫంక్షన్ నడిపించే ప్రయత్నం చేశారు యాంకర్లు. అందులో భాగంగానే చలపతిరావు తన నోటిదూల చూపించాడు. అందుకే ఇప్పుడా డైలాగ్ ఉంచాలా తీసేయాలా అనే ఆలోచనలో ఉన్నారు నాగ్.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. సరిగ్గా ఇంకో 48 గంటల్లో సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. థియేటర్లలో మళ్లీ ఆ డైలాగ్ వినిపిస్తే తగ్గుముఖం పడుతున్న వివాదాన్ని మళ్లీ కెలికినట్టు అవుతుందని నాగార్జున ఫీలింగ్.

సినిమాలో డైలాగ్ ఉంచాలా తీసేయాలా అనే అంతిమ నిర్ణయం పూర్తిగా నాగార్జునదే. ఎందుకంటే ఈ సినిమాకు నాగ్ నిర్మాత మాత్రమే కాదు, అంతకుమించి అనే విషయం అందరికీ తెలిసిందే. సో.. సినిమాలో నాగార్జున ఆ డైలాగ్ ఉంచుతున్నారా.. తొలిగిస్తున్నారా..? మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?