Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'ఛలో' టు వాచ్ బోర్డర్ కామెడీ

నాగశౌర్య లేటెస్ట్ మూవీ ఛలో ట్రయిలర్ విడుదలయింది. ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ దగ్గర పనిచేసిన వెంకీ కుడముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శౌర్య ఓన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ట్రయిలర్ పక్కాగా కామెడీ ట్రాక్ లోనే నడిచింది. తమిళనాడు-ఆంధ్ర బోర్డర్ లో, తమ తమ భాషలు, సినిమాలు, యాసలు, ఇతర వ్యవహారాలపై పట్టుగా వుండే రెండు వర్గాల మధ్య చిక్కిన ఓ ప్రేమ జంట కథనే సినిమా అన్నట్లు ట్రయిలర్ చెప్పకనే చెప్పింది. 

మీరు గొప్ప.. మేము గొప్ప అని పెద్ద వాళ్లు కత్తులు నూరితే అది ఫ్యాక్షనిజం అవుతుంది. మా సినిమా గొప్ప..మా వాడు గొప్ప.. అంటూ చిన్న పిల్లల్లా, కబుర్లు చెప్పుకుంటే ఫన్ జనరేట్ అవుతుంది. ఆ కామెడీ యాంగిల్ నే సినిమా కోసం వర్కవుట్ చేసినట్లుంది. ట్రయిలర్ చూస్తే, ఆ ఫన్ వర్కవుట్ అయినట్లే కనపిస్తోంది.

కొన్ని కొన్ని సీన్లు ట్రయిలర్ లో అలా అలా లైట్ గా టచ్ చేసారు. కానీ అవి ఫుల్ లెంగ్త్ చూస్తే కచ్చితంగా ఫన్ సూపర్ గా వుండేలా కనిపిస్తోంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు అసెట్ గా అవుతుందని ట్రయిలర్ శాంపిల్ చూపించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?