Advertisement


Home > Movies - Movie Gossip
చందు సినిమా వెనక్కు.. మారుతి ముందుకు?

హీరోల మనసులు ఎప్పుడు ఎలా వుంటాయో తెలియదు. ఎలా మారతాయో తెలియదు. మొన్నటి వరకు వున్న లైన్ ఆప్ ఆర్డర్ ప్రకారం నాగ్ చైతన్య తన తరువాతి సినిమాను మైత్రీ మూవీస్ కోసం చందు మొండేటి డైరక్షన్ లో చేయాల్సి వుంది. ఆ తరువాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ కోసం మారుతి డైరక్షన్ లో.

అయితే యుద్ధం శరణం తరువాత ఈ ఆర్డర్ మారిపోయినట్లు తెలుస్తోంది. చందు మొండేటి సినిమాతో పాటే మారుతి సినిమా కూడా చేయాలని, ఆపైన వీలయితే అదే ముందు విడుదల చేయాలని నాగ్ చైతన్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సహేతుక కారణమే వుంది.

నాగ్ చైతన్యకు మాస్, యాక్షన్ జోనర్లు అచ్చి రావని యుద్ధం శరణం మరోసారి ప్రూవ్ చేసింది. చందుమొండేటి కథ ఎంత డిఫరెంట్ అయినా, అది కూడా కాస్త యాక్షన్ వున్న సినిమానే. ఒక చేయ్యి హీరో మాట వినకుండా తన పని తాను చేయడం అంటే అదే కదా?

అందుకే యుద్ధం శరణం తరువాత ఫ్యామిలీ, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అందించాలని చైతూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి చెప్పిన లైన్ అదే కావడంతో దాన్ని చకచకా ఫినిష్ చేసి, ముందుకు తేవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.