Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్‌ ‘దూకుడు’ చూపిస్తాడు

చరణ్‌ ‘దూకుడు’ చూపిస్తాడు

గోవిందుడు అందరివాడేలేతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేయడానికి చూస్తున్న మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ఇకపై ఎక్కువగా వినోదాత్మక చిత్రాలు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. మాస్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ వచ్చేయడంతో ఇక కొన్నాళ్లు కామెడీ మీద ఫోకస్‌ పెడుతున్నాడు. 

అందుకే తన మలి చిత్రాన్ని శ్రీను వైట్ల డైరెక్షన్‌లో కమిట్‌ అయ్యాడు. అలాగే వైట్ల సినిమాల్లో చాలా వాటికి తమ రచనతో రేంజ్‌ పెంచిన కోన వెంకట్‌, గోపీమోహన్‌ల కథతో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడని టాక్‌. ఇటీవలే చరణ్‌ని కలిసి లైన్‌ చెప్పారట. దానికి చరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. 

ఈ సంగతి కోన వెంకట్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది కూడా రెడీ, దూకుడు చిత్రాల్లా చాలా వినోదాత్మకంగా ఉంటుందని కోన తెలియజేసాడు. ఇలాంటి కథ రాస్తే గతంలో వీరిద్దరూ శ్రీను వైట్లకే ఇచ్చేసేవారు. కానీ ఈమధ్య ఇద్దరూ వైట్లకి దూరంగా ఉంటున్నారు కనుక వేరే దర్శకుడితో చేసే అవకాశముంది. అతను ఎవరనేది ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?