Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ చరణ్ కు అష్టమగండం

రామ్ చరణ్ కు అష్టమగండం

టాలీవుడ్ అంటేనే సెంటిమెంట్లే సెంటి మెంట్లు. కాంబినేషన్లు, ముహుర్తాలు, అంకెలు ఇలా ఇన్నీ అన్నీ కావు. డైరక్టర్లకు రెండో సినిమా గండం అన్నట్లే హీరోలకు వుంది. వాళ్లకి ఏడో సినిమా లక్..ఎనిమిదో సినిమా బ్యాడ్ లక్. ఈ గండాన్ని దాదాపు అందరు హీరోలు అనుభవించేసారు. రీసెంట్ గా నాగ చైతన్యతో సహా. మనం ఏడో సినిమా హిట్. ఆటోనగర్ సూర్య ఎనిమిదో సినిమా ఫట్. 

ఇప్పుడు రామ్ చరణ్ కు ఏడో సినిమా ఎవడు హిట్. మరి గోవిందుడు ఎనిమిదో సినిమా. ఇదే ఫ్యాన్స్ ను కాస్త కలవరపెడుతోంది. సినిమా బాగా వచ్చిందని, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఆదరిస్తారని అందరూ భావిస్తున్నారు. నిర్మాత గణేష్, దర్శకుడు కృష్ణ వంశీ చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. చిరంజీవి అయితే పరుచూరి సోదరులు చేయి చేసుకున్నారు కనుక ఇంకా సూపర్ అంటున్నారు. గండం గట్టెక్కితే మంచిదేగా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?