Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్‌ని దువ్వుతోన్న సమంత

చరణ్‌ని దువ్వుతోన్న సమంత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటి టాప్‌ హీరోల్లో చాలా మందితో నటించేసిన సమంత ఇంతవరకు చరణ్‌, ప్రభాస్‌ మినహా అందరితో చేసేసింది. అల్లు అర్జున్‌తో ప్రస్తుతం ఒక చిత్రం చేస్తోంది కాబట్టి టాప్‌ హీరోల్లో చరణ్‌, ప్రభాస్‌ తప్ప అందరూ అయిపోయినట్టే. ఎన్టీఆర్‌తో మూడు, మహేష్‌తో రెండు చిత్రాలు చేసేసిన సమంత ‘ఎవడు’లో చరణ్‌తో నటించాల్సింది కానీ డేట్స్‌ సమస్యల వల్ల మిస్‌ అయింది.

గతంలో వచ్చినట్టుగా ఇప్పుడు సమంతకి తెలుగులో ఛాన్స్‌లు రావడం లేదు. అల్లు అర్జున్‌తో చేస్తోన్న సినిమా తప్ప ఇంకేదీ కన్‌ఫర్మ్‌ కాలేదు. బ్యాలెన్స్‌ ఉన్న స్టార్‌ హీరోలతో నటించడానికి ఇదే రైట్‌ టైమ్‌ అనుకుందో ఏమో... చరణ్‌ అటెన్షన్‌ రాబట్టడానికి సమంత తనదైన శైలిలో ప్రయత్నిస్తోంది. 

ఎప్పుడో వచ్చిన ‘నాయక్‌’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’ పాటని ఇప్పుడే ఫస్ట్‌ టైమ్‌ చూసినట్టుగా.. ఈ పాట ఓ లెవల్లో ఉందని కితాబిచ్చింది. పాటలో చరణ్‌ ఆటిట్యూడ్‌ తెగ నచ్చేసిందని చెప్పింది. దాంతో చరణ్‌తో నీ కాంబినేషన్‌ ఎప్పుడంటూ చరణ్‌ అభిమానులు సమంతని అదే పనిగా అడిగేసారు.

సోషల్‌ నెట్‌వర్క్‌లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాడు కనుక సమంత కాంప్లిమెంట్‌ చెర్రీని రీచ్‌ అయ్యే ఉంటుంది. ఇక సమంతని తన నెక్స్‌ట్‌ సినిమాకి రికమండ్‌ చేయడమే మిగిలింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?