Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్-ఎన్టీఆర్-రాజమౌళి ఫిక్స్?

చరణ్-ఎన్టీఆర్-రాజమౌళి ఫిక్స్?

హమ్మయ్య, సస్సెన్స్ విడిపోయింది. ఆ మధ్య సన్నగా గుసగుసలు వినిపించినట్లే అయింది. రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ కాంబినేషన్ లో రాజమౌళి సినిమా ఫిక్సయిపోయింది. ఈ మేరకు రాజమౌళి ట్వీట్ చేసేసారు. ఏమీ చెప్పకుండానే ఒక్క ఫొటో పోస్టింగ్ తోనే రాజమౌళి విషయం రివీల్ చేసినట్లు కనిపిస్తోంది.

రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో కలిసి కూర్చున్న సరదా ఫొటోను రాజమౌళి ట్వీట్ చేసాడు. ఏ విధమైన వాఖ్యానం లేదు. జస్ట్ ఓ స్మయిలీ సింబల్ తప్ప. దీని అర్థం వారి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాననే అనుకోవాల్సి వస్తోంది. 

పైగా చరణ్, ఎన్టీఆర్ క్యాంప్ లకు కాస్త సన్నిహితంగా ఉన్నవారిని అడిగితే, ఇప్పుడే తామేం చెప్పలేమని అంటున్నారు. కానీ అదే సమయంలో ఈ కాంబినేషన్ ను కొట్టి పారేయలేమనీ అంటున్నారు. ఇదే కాంబినేషన్ వుండొచ్చని గత కొన్నాళ్లుగా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.

పైగా ఇటీవల రాజమౌళి మెగా క్యాంప్ కు బాగా దగ్గరగా వుంటున్నారు. ఎన్టీఆర్ తో రాజమౌళికి వున్న అనుబంధం తెలిసిందే. 

చరణ్-ఎన్టీఆర్ లకు తోడు పక్క భాషలకు చెందిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు, ఓ విలన్ తోడయితే ఇక మళ్లీ ఓ రేంజ్ సినిమా తయారవుతుంది. ఈ సినిమాకు నిర్మాత డివివి దానయ్యే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

రామ్ చరణ్ చేస్తున్న రంగస్థలం పూర్తి కావస్తోంది. ఆ తరువాత బోయపాటి సినిమా చేయాలి. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేయాలి. అంటే చరణ్, ఎన్టీఆర్ చెరో సినిమా చేయగానే రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం వుంటుంది. 

కానీ చివరాఖరుగా ఒకటే డవుట్. ఇదే కాంబినేషన్ ఫిక్స అయితే రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ తో సమ్మర్ టైమ్ లో సినిమా చేయాలనుకున్న కొరటాల శివ ఏం చేస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?