Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్ యూనిట్ తెలివైన పని

చరణ్ యూనిట్ తెలివైన పని

రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమా రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు బ్రూస్ లీ అని పేరు పెట్టడంతో ఫ్యామిలీ సర్కిల్ ఆడియన్స్ లో నెగిటివ్ ఇమేజ్ వస్తుందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.

ఏదో స్టంటు పిక్చరు అని ఫ్యామిలీ ఆడియన్స్ టాక్ తెలిసేదాకా పక్కన వుంటారన్న కామెంట్లు వినవచ్చాయి. ఇప్పుడు ఈ కామెంట్లకు సమాధానం చెప్పడానికి, ఇది ఫ్యామిలీ సినిమా అని ఫ్యామిలీ ఆడియన్స్ కు సందేశం ఇవ్వడానికి ఓ కొత్త టీజర్ ను వదిలారు. ఇందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేను అకేషన్ గా తీసుకున్నారు.

Click Here For Teaser

ఈ టీజర్ చూస్తుంటే, ఫక్తు ఫ్యామిలీ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ఎక్కడ మాస్ ఎలిమెంట్స్ అన్నవి కనిపించనివ్వలేదు. టైటిల్ వల్ల వచ్చిన మచ్చను ఈ విధంగా చెరిపేసుకోవాలని చూస్తున్నట్లుంది. ఏమయితేనే టీజర్ మాత్రం పక్కా హోమ్లీగా బాగానే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?