Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్‌చరణ్.. అనసూయ కోసం వెయిటింగ్..!

 రామ్‌చరణ్.. అనసూయ కోసం వెయిటింగ్..!

తను సినిమాల్లో బిజీగా గడిపేయాలని అనుకుంటున్న అనసూయకు అక్కడ మంచి మంచి అవకాశాలే దక్కుతున్నాయి. టీవీ న్యూస్ యాంకర్ గా వెలుగులోకి వచ్చిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోలు వెయిట్ చేసేంత స్థాయికి ఎదిగింది.

విషయం ఏమిటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ పార్టు షూటింగ్ పెండింగ్ లో ఉంది. సినిమాలో ఈమెది ఒక కీలకపాత్ర అని తెలుస్తోంది. అందుకు సంబంధించి సీన్ల షూటింగ్ కోసం చరణ్, సుకుమార్ లు వేచి చూస్తున్నారట. 

బిజీ బిజీగా ఉన్న అనసూయ త్వరలోనే ‘రంగస్థలం’ షూటింగ్ లో పాల్గొననున్నదని సమాచారం. మరి ఇది వరకూ నాగార్జున వంటి పెద్ద హీరోతో స్క్రీన్ ను షేర్ చేసుకున్న అనసూయ చరణ్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తోందో అనేది ఆసక్తికరంగా ఉంది.

అలాగే మంచువిష్ణు సినిమాలో కూడా ఒకపాత్ర కోసం అనసూయతో సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. దర్శకుడు మదన్.. మంచు విష్ణుతో సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నాడట. అందులో అనసూయను ఒక ముఖ్యపాత్రకు అనుకుంటున్నారని సమాచారం. మొత్తానికి అనసూయకు యమ డిమాండు కొనసాగుతున్నట్టుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?