Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్ వీక్ నెస్ లు బయటపెట్టిన సినిమా

చరణ్ వీక్ నెస్ లు బయటపెట్టిన సినిమా

ఏ నటుడికైనా కొన్ని వీక్ నెస్ లు వుంటాయి..వీక్ ఏంగిల్స్ వుంటాయి. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ వాటిని గుర్తించి, వీలయినంత వరకు అవి ఎలివేట్ కాకుండా చూసుకోవాలి. హీరో రామ్ చరణ్ ఫేస్ లో ఎమోషన్లు అంతగా పలకవు అన్నది ఇప్పటిదాకా వున్న అభిప్రాయం. 

అందుకే అతగాడు కూడా తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు కృష్ణవంశీతో కలిసి గోవిందుడు అందరివాడేలే చేసాడు. కానీ సినిమాలో మాత్రం అంతగా ఫీలింగ్స్ పండలేదు. దీంతో మరోసారి రామ్ చరణ్ ఈ తరహా పాత్రలకు నప్పుతాడా అన్న అనుమానం కలిగేలా చేసారు. 

అలాగే రామ్ చరణ్ కాస్త హైట్ తక్కువ. అతగాడికి షార్ట్ లు నప్పవు. అలాంటిది ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి జైగాంటిక్ పర్సనాలిటీల నడుమ షార్ట్ లు, చిన్న పిలక వేసి, నటింపచేసారు. దాంతో హీరోయిజం కనిపించలేదు. పైగా చిన్న పిల్లాడి లుక్ వచ్చేసింది. ఈ పిలక కోసం రెండు పక్కలా జుట్టు కాస్త తగ్గించడంతో మొహం షేప్ కాస్త మారిపోయింది. మొత్తానికి ఇంతకు మందు సినిమాల్లో వున్నఅందం కనిపించకుండాపోయింది. 

Video: Govindudu Andaraivadele Public Talk

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?