Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చినదానలో.... పవర్ స్టార్?

చినదానలో.... పవర్ స్టార్?

పవన్ కళ్యాణ్ ఏమిటి? నితిన్ సినిమాలో కనిపించడమా అని ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ చినదాన నీకోసం సినిమాలో పవన్ ఫ్యాన్స్ కు ఓ సర్ ప్రయిజ్ వుంటుందని మాత్రం తెలుస్తోంది. ఈ సర్ ప్రయిజ్ సెకండాఫ్ లో వుండొచ్చు. పవన్ నేరుగా కామియోగా కనిపిస్తాడా? లేక నితిన్ పవన్ మాస్క్ పెట్టుకుని కనిపిస్తాడా? ఇలా చాలా సందేహాలు వున్నాయి. 

కానీ ఒకటి మాత్రం గ్యారంటీ..పవన్, పవన్ ఫైట్ చినదాన నీ కోసంలో వున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. నితిన్ స్వయంగా పవన్ వీరాభిమాని. మరోపక్క దర్శకుడు కరుణాకరన్ అంటే పవన్ కు కాస్త మంచి ఒపినీయిన్ వుంది. అందుకోసమే ఇందుకు ఓకె అన్నాడని తెలుస్తోంది. అయితే నిజంగా పవన్ గెస్ట్ లేదా కామియోగా కనిపించాడా అన్నదానిపై యూనిట్ వర్గాలు పెదవి విప్పడం లేదు. ఏదో సర్ ప్రయిజ్ వుందని మాత్రం చెబుతున్నాయి.

ఇదిలా వుంటే చినదాన నీకోసం సినిమాపై మిక్స్ డ్ ప్రీ రిలీజ్ టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ అలరిస్తుందని, సెకండాఫ్ కాస్త వీక్ అని, అయితే అందులో కొన్ని ట్విస్ట్ లు వుండడం వల్ల అవి క్లిక్ అయితే సినిమా హిట్ గ్యారంటీ అని తెలుస్తోంది. మరో రెండు రోజులు ఆగితే అన్ని విషయాలు తెలిసిపోతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?