Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరంజీవి సినిమాలో అక్షయ్ కుమార్

చిరంజీవి సినిమాలో అక్షయ్ కుమార్

ప్రస్తుతానికి ఇది పుకారే. కానీ నిజమయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. చిరంజీవి 151వ సినిమాలో కీలకమైన పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ డీల్ కనుక ఓకే అయితే అక్షయ్ కుమార్ గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టే. అయితే చిరు 151వ సినిమాలో అక్షయ్ కుమార్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తారా.. లేక విలన్ పాత్రలో కనిపిస్తారా అనే డీటెయిల్స్ మాత్రం తెలియవు.

త్వరలోనే తన 151వ సినిమాను ఎనౌన్స్ చేయబోతున్నారు చిరంజీవి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫైనల్ వెర్షన్ ను ఈమధ్యే చిరంజీవికి వినిపించాడట సురేందర్ రెడ్డి. ప్రస్తుతం కీలకమైన నటీనటుల ఎంపికలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్షయ్ కుమార్ పేరును పరిశీలిస్తున్నారట.

రజనీకాంత్ నటిస్తున్న రోబో సీక్వెల్ 2.0తో సౌత్ కు పరిచయం అవుతున్నాడు అక్షయ్ కుమార్. ఆ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అక్షయ్ రాకతో 2.0 మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. సో.. చిరంజీవి సినిమాకు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటున్నారట. ఉయ్యాలవాడ ప్రాజెక్టులోకి అక్షయ్ ఎంటరైతే, చిరంజీవి బాలీవుడ్ రీఎంట్రీకి కూడా లైన్ క్లియర్ అయినట్టే. చూస్తుంటే, ఖైదీనంబర్ 150 కంటే ఉయ్యాలవాడ ప్రాజెక్టు మరింత భారీగా తయారయ్యేట్టుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?