Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఉయ్యాలవాడ కథ విని, ఉబ్బితబ్బిబ్బైన మెగాస్టార్

ఉయ్యాలవాడ కథ విని, ఉబ్బితబ్బిబ్బైన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ ప్రకటించిన వివరాలను బట్టి.. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కంటె ముందే.. బ్రిటిషు పాలకులను గడగడలాడించిన తెలంగాణ పోరాట యోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనన్యమైన కీర్తి ఉంది. ఎంతో వీరోచితమైన ఈ పాత్రను చిరంజీవి చేయదలచుకున్నప్పటినుంచి ప్రాజెక్టుకు మంచి హైప్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు వర్క్ ఒక దశ పూర్తయిందిట. దర్శకుడు సురేందర్ రెడ్డి , మెగాస్టార్ కు రెండు రోజుల కిందట కథ కూడా వినిపించారుట. పూర్తయిన స్క్రిప్టు క్రమంలో దర్శకుడు వినిపించినప్పుడు.. చిరంజీవి ఉబ్బితబ్బిబ్బు అయినట్లుగా సమాచారం. సురేందర్ రెడ్డి కథ చెప్పడం పూర్తి కాగానే చిరంజీవి అతణ్ని కౌగిలించుకుని స్క్రిప్టు చాలా బాగా చేసినందుకు అభినందించినట్టుగా తెలుస్తోంది. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పోరాట యోధుడి పాత్రను చిరంజీవి చేయదలచుకుంటున్నారనే వార్త కొన్నేళ్లుగా ఫిలిం వర్గాల్లో నడుస్తూనే ఉంది. ఒక దశలో చిరంజీవి 150వ చిత్రం ఇదే అవుతుందని కూడా అంతా అనుకున్నారు. కానీ అది ప్రస్తుతం 151వ చిత్రంగా తెరకెక్కబోతోంది. దీనిని కూడా చరణ్ నిర్మిస్తున్నారు. మొత్తానికి చిరంజీవికి స్క్రిప్టు బాగా నచ్చిందని, దర్శకుడు చెబుతుండగా.. మధ్యలో ఒక్క ఎదురు ప్రశ్నలు కూడా లేకుండా.. విని చాలా సంతోషించారని ఫిలింనగర్లో వినిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?