Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరు 150 వ సినిమాలో హీరో పాత్ర

చిరు 150 వ సినిమాలో హీరో పాత్ర

చిరంజీవి 150 వ సినిమా అఫిషియల్ గా అయితే రామ్ చరణ్-శ్రీనువైట్లు కాంబినేషన్ లో నటిస్తున్నదే అవుతుంది. ఎందుకంటే అదేమీ కామియో రోల్ కాదు..మగధీర మాదరిగా. కాస్త కనిపించే పాత్రనే. ఇది సినిమాలో మధ్యలోనూ, చివరిలోనూ వస్తుందని తెలుస్తోంది. ఇది సినిమాలొ  సినిమా హీరొ పాత్ర అని, అసలు హీరో రామఛరణ్ తో అనుబంధం వుండే పాత్ర అని, ఈ హీరోకి కష్టం వచ్చినపుడు, చిరంజీవి ఆదుకుంటారని, అలాగే మళ్లీ క్లయిమాక్స్ లో కూడా కనిపిస్తారని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. 

మరి ఇదే నిజమైతే, ఇదే చిరంజీవి 150 వ సినిమా అవుతుంది. పూరి కానీ, వినాయక్ కానీ చేసేది 151 సినిమానే అవుతుంది.  ఆ సినిమా కొబ్బరి కాయ కొట్టుకోవడానికి ఇక మూడు వారాలే సమయం వుంది. ఇప్పటికి వినవస్తున్న సమాచారం ప్రకారం దీనికి ఇంకా కథ ఓ కొలిక్కి రాలేదు. వినాయక్ లైన్ డిస్కషన్ లోనే వుంది. 

పూరి ఫస్టాఫ్ మాత్రమే పూర్తి చేసి, లోఫర్ సెట్ మీదకు వెళ్లిపోయారు. మరి ఇది ఎప్పుడు కొలిక్కి వస్తుందో?సో అభిమానులు రామ్ చరణ్ సినిమాలో చిరు పాత్రతోనే 150 వ సినిమా సెలబ్రేషన్లు చేసుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?