Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరు 151 : బాలీవుడ్ కనెక్షన్

చిరు 151 : బాలీవుడ్ కనెక్షన్

బాహుబలి-2 సినిమా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వసూళ్ల పరంగా నంబర్ వన్ మూవీ ఇదే. దీంతో చాలా సౌత్ సినిమాలు బాలీవుడ్ ను టార్గెట్ చేశాయి. చిరంజీవి 151వ సినిమా కూడా. అవును.. ఈ సినిమాకు బాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్లను రంగంలోకి దించాలని ఫిక్స్ అయ్యారు. వాళ్లలో ఒకరు బిగ్ బి అమితాబ్. మరొకరు కండలవీరుడు సల్మాన్ ఖాన్.

స్వతంత్ర్య ఉద్యమం నాటి కథతో రాబోతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సినిమాకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అయితే అమితాబ్ ఒప్పుకుంటారా అనేది ఇక్కడ ప్రశ్న.

"మనం" సినిమా టైపులో ఇలా వచ్చి అలా మెరిసే పాత్రలైతే అమితాబ్ పెద్దగా అభ్యంతరం చెప్పరు. అంతకంటే పెద్ద పాత్ర అయితే మాత్రం కథతో పాటు క్యారెక్టర్ అమితాబ్ కు నచ్చాల్సిందే. ఈమధ్య అమితాబ్ ను "రైతు" అనే ప్రాజెక్టులోకి తీసుకునేందుకు బాలకృష్ణ కూడా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. మరి చిరంజీవి సక్సెస్ అవుతారా అనేది చూడాలి.

ఉయ్యాలవాడ ప్రాజెక్టులోకి బిగ్ బి ఎంటరైతే కచ్చితంగా సినిమా రీచ్ పెరుగుతుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ప్రచారం కల్పిస్తే సినిమా రేంజ్ పెరగడం గ్యారెంటీ. అమితాబ్ ని ఒప్పించే బాధ్యతను చిరంజీవి, సల్మాన్ ను లైన్లో పెట్టే బాధ్యతను "ఉయ్యాలవాడ" నిర్మాత రామ్ చరణ్ తీసుకున్నాడు. మరి వీళ్లిద్దరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?