Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరు సినిమా 2019కే?

చిరు సినిమా 2019కే?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కనీసం ఏడాది లోపు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రారంభం కావడమే ఈ ఏడాది దసరా నాటికి కానీ వీలు కాదని తెలుస్తోంది. ఈ సినిమా ప్లానింగ్ లోనే ఇంకా చాలా డిస్కషన్లు నడుస్తున్నాయి. టోటల్ బడ్జెట్, మార్కెటింగ్, స్పాన్సర్లు, ఇలా చాలా వాటిపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అన్ని విధాలా టోటల్ గా బడ్జెట్ ఎంతవుతుంది? అన్నది ఫిక్స్ కావాలంటే ముందుగా టెక్నికల్ టీమ్, స్టార్ కాస్ట్, విఎఫ్ఎక్స్ ఖర్చు ఇవన్నీ క్లియర్ కావాలి. అలాగే కాస్ట్యూమ్స్, లొకేషన్లు, సెట్ లు వగైరా కూడా ఓ అంచనాకు రావాలి. ఇవేవీ జరగకుండా సినిమా ప్రారంభించడం అన్నది సాధ్యం కాదు. వన్స్ బడ్జెట్ డిసైడ్ అయితే, అన్నీ ఫిక్సయిపోయినట్లే. అక్కడి నుంచి సినిమా సెట్ మీదకు వెళ్లాలి. సెట్ మీదకు వెళ్లిన తరువాత పెద్ద సమస్య లేదు కానీ, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ల కోసం కాస్త టైమ్ పట్టక తప్పదు.

ఎప్పుడైతే మూడు భాషలు, భారీ విజువల్ ఎఫెక్ట్ లు అని ఫిక్స్ అయితే, గ్రౌండ్ వర్క్ కే నెలలు పడుతుందట. వీటన్నింటి సిటింగ్ లో రామ్ చరణ్ వుండాల్సిందే. ఆయన ఓ పక్కన సుకుమార్ సినిమా ఫినిష్ చేయాలి. అందువల్ల టోటల్ గా సినిమా పూర్తి అయి థియేటర్ లోకి రావాలంటే కనీసం ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే 2018 ఎండ్ కు సినిమా రెడీ అవుతుంది. అలాంటపుడు ఇక విడుదలయ్యేది 2019 సంక్రాతికే కావచ్చు.

అందుకే ఈ సినిమా వర్క్ చేస్తూనే, మరో మాంచి కమర్షియల్ సబ్జెక్ట్ దొరికితే, దాన్ని కూడా డీల్ చేస్తే ఎలా వుంటుంది? అప్పుడు 2018 లో దాన్ని ముందుగా విడుదల చేసుకోవచ్చు అని సలహాలు వినిపిస్తున్నాయట. కానీ దానికి చిరు ఓకె అనడం లేదని తెలుస్తోంది. ఉయ్యాలవాడకు ముందు మరే సినిమా చేసినా, దాని ఎఫెక్ట్ వుంటుందని, అందువల్ల చేస్తే ఉయ్యాలవాడ చేయడమే అని అంటున్నారట. అందుకే పూర్తి టైమ్ కోసం టీవీషో కూడా ఇక చేయకూడదనుకుంటున్నారట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?