Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరును దాటేసిన బాలయ్య

చిరును దాటేసిన బాలయ్య

ఎన్ని రోజులు ఆడింది.. ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేసారు, ఇవన్నీ సినిమా విడుదలయిన తరువాత లెక్క పెట్టే రికార్డులు. కానీ ఇప్పుడు విడుదలకు ముందే లెక్క పెట్టే రికార్డులు కూడా వచ్చేసాయి. సోషల్ నెట్ వర్క్ రికార్డులు ఇవన్నీ. ఎన్ని లైక్ లువచ్చాయి. ఎన్ని షేర్ లు వచ్చాయి. ఎన్ని హిట్ లు వచ్చాయి. అవి కూడా ఎంత తక్కువ టైమ్ లో వచ్చాయి.

లేటెస్ట్ గా చూసుకుంటే బాలయ్య సినిమా పైసా వసూల్ రికార్డులు సృష్టిస్తోంది. ఎలా అంటే, పైసా వసూల్ థియేటర్ ట్రయిలర్ విడుదలయిన 24గంటల్లో 2.9 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయంలో టాప్ త్రీ ప్లేస్ ను సాధించింది. ఇంతకు ముందు ఈ ప్లేస్ లో వున్న చిరు ఖైదీ నెంబర్ 150ని నాలుగోప్లేస్ కు దించేసింది. చిరు సినిమా 24గంటల్లో 2.4మిలియన్ల వ్యూస్ సాధించింది.

వన్, టూ ప్లేస్ ల్లో బాహుబలి 2 (21.7 మిలియన్లు), డిజె (4.6 మిలియన్లు) వున్నాయి. మూడో ప్లేస్ లో పైసా వసూల్ వుంది. అన్నట్లు మన పవన్ బాబు కాటమరాయుడు (2.16 మిలియన్) అయిదో ప్లేస్ లో వుంది.

పైసా వసూల్ కొత్తగా స్టంపర్ అంటూ విడుదల చేసిన టీజర్ తొమ్మిది మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?