Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరు కు ఇంకా దొరకలా?

చిరు కు ఇంకా దొరకలా?

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ప్రారంభమైపోయింది. రెండో రోజు షూట్ కూడా జరిగిపోయింది. చేసిన మేరకు ఎడిట్ చేసి, రష్ చూసుకుని హ్యాపీ ఫీలయ్యారు ఒకె. మరి ఇంతకీ హీరోయిన్ సంగతేమిటి? అదే సమస్య గా మారిపోయింది. ఎవరు.. ఎవరు.. ఎవరు.. ఎటు చూసినా ఎవరూ కనిపించడం లేదట.

 ఆఖరికి మరోసారి ఎలాగోలా అనుష్కనే ఒప్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకోసం అటు యువి దగ్గర వున్న డేట్ల నుంచి కాస్త సెట్ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. ఈ లోగా టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని హీరొయిన్ తో సంబంధం లేని సీన్లు కానిచ్చేయాలని డిసైడ్ అయ్యారట. 

మరి అనుష్క ఒకె అంటుందో.. లేక మరెవరు దొరుకుతారో? కాస్త కష్టంగానే వుంది పాపం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?