Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చుట్టాలబ్బాయి ఎప్పుడొస్తాడు?

చుట్టాలబ్బాయి ఎప్పుడొస్తాడు?

రెండు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు అందించి, తన బలం అక్కడే అని భాయ్ సినిమాతో గ్రహించి, మళ్లీ అలాంటి సినిమా అందిస్తున్న దర్శకుడు వీరభద్రమ్ చౌదరి. ఆది సాయకుమార్ తొ చుట్టాలబ్బాయి సినిమా పూర్తి చేసేసాడు. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడన్నదే ఇప్పుడు లెటెస్ట్ బజ్. ఆగస్టు అయిదును అని ఇన్నాళ్లు అంటున్నారు. 

కానీ ఇప్పుడు కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ 29న రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. 5న మనమంతా సినిమా వుంది.అదే రోజు శ్రీరస్తు శుభమస్తు విడుదల కూడా, అరవింద్ ప్రెస్టీజియస్ గా ఈ సినిమాను 300 కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.  12న బాబు బంగారం వుంది. మరి వీటన్నింటి మధ్య 5న రావడమా లేక 13వ తేదీకి వెళ్లడమా అని నిర్మాతలు ఆలోచిస్తున్నారని వినికిడి. 

సినిమాల పోటీ అనేదాని కన్నా, థియేటర్లు, లాండింగ్ పేజీలు, టీవీ స్లాట్ లు ఇలా చాలా సమస్యలు వుంటాయ కనుక, 13న అయితే ఏ సమస్య వుండదని భావిస్తున్నారు. తిక్క సినిమా 13న అని అంటున్నారు కానీ, రాదు అనే ఫీలర్ కూడా వినిపిస్తోంది. అందువల్ల ఆ డేట్ ను వాడుకోవాలని ఆలోచన. ఈ వారం సినిమాల టాక్ చూసి, 5న రావాలా? 13న రావాలా అన్నది డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?