Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమావారి బాటలో మంత్రులు

సినిమావారి బాటలో మంత్రులు

సినిమా కాస్త బాగుంది అనిపించుకుంటే చాలు..దాన్ని మరి కాస్త ముందుకు నడిపించడానికి హీరో, హీరోయిన్, డైరక్టర్ అందరూ కలిసి థియేటర్లు తిరిగేయడం టాలీవుడ్ జనాలకు అలవాటు. ఆ విధంగా తమ సినిమా సూపరహో..అని చాటింపు వేస్తే, మరి కాస్త కలెక్షన్లు వస్తాయేమో అని ఆశ.

మన రాష్ట్రంలో రాజకీయాలు, సినిమాలు చెట్టాపట్టాలేసుకున్నాయి కాబట్టి, రాజకీయ నాయకులు కూడా ఇదే అయిడియా చేస్తున్నారు. ఇప్పుడు నలుగురు మంత్రులు కలిసి, చంద్రన్న విజయ యాత్ర అంటూ 13 జిల్లాలు తిరిగేస్తారట.

అసెంబ్లీలో కాస్త గట్టిగా నోరు చేసుకునే మంత్రి అచ్చెంనాయుడు, మరోముగ్గురు మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు కలిసి ఓ బస్సు వేసుకుని జిల్లాలు తిరగేసి, జనాలకు బాబు విజయ గాధలు వివరిస్తారట. ఈ యాత్రకు చంద్రన్న విజయ యాత్ర అని పేరు పెట్టారు. ఈ యాత్ర ఈ నెల 9 నుంచి 16 వరకు సాగుతుందట.

బాగానే వుంది. కానీ మంత్రులు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తమ విలువైన సమయం కేటాయించడం మానేసి, ఇప్పుడు ఏ అవసరం అని ఈ విజయయాత్రలు అన్నది అనుమానం. నిజంగా చంద్రబాబు అన్ని విజయాలు సాధించారు అనుకున్నపుడు, ప్రత్యేకంగా వెళ్లి చాటింపు వేయడం ఎందుకు? ప్రజలకే తెలుస్తుందిగా?

అసలే ఓ పక్క వర్షాలు లేవు. సీమ జిల్లాల్లో తాగేందుకు నీళ్లు లేవు. వలసలు పెరిగాయి. ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ ఉల్లి పత్రికల్లోనే కనిపిస్తోంది. కరువు ఎఫెక్ట్ ఇప్పటి నుంచే బియ్యం ధరలపై ప్రభావం చూపించడం ప్రారంభమైంది. పప్పు దినుసుల ధరలు సరేసరి. మరోపక్క ర్యాగింగ్ లు, ఆత్మహత్యలు, వగైరా సమస్యలు పెరిగాయి. మరి వీటన్నింటి నడుమ చంద్రన్న విజయయాత్రలంటే ఏం చెబుతారో? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?