Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమాలంటే సారీ అంటున్న మోక్షజ్ఞ?

సినిమాలంటే సారీ అంటున్న మోక్షజ్ఞ?

నందమూరి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది మోక్షజ్ఞ సినిమా కోసమే. 22ఏళ్ల ఈ కుర్రాడు ఎప్పుడు సినిమాల్లోకి వచ్చి, తొలి సినిమా చేస్తాడా? అని అభిమానులు ఎదురుచూస్తున్నది వాస్తవం. నందమూరి మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావాలని తండ్రి నందమూరి బాలకృష్ణకు కూడా చాలా ఆసక్తిగానే వుంది. కానీ సరైన టైమ్, సరైన డైరక్టర్ కోసం చూస్తున్నారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే సరైన టైమ్ అంటే సరైన డైరక్టర్ దొరకడమే అన్నమాట.

బాలకృష్ణ ఎంట్రీ టైమ్ లో విశ్వనాధ్, బాపులాంటి వాళ్లతో పనిచేయాలని తండ్రి ఎన్టీఆర్ అనుకున్నారు. అలాగే చేసారు కూడా. ఎందుకంటే నటనలో అనుభవం పడుతుందని. అందుకే బాలయ్య కూడా అలాగే అనుకుంటున్నారు. రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, బోయపాటి, ఇలాంటి టాప్ లైన్ డైరక్టర్ల పేరు బాలయ్య మదిలో వున్నాయని వార్తలు వినవస్తూనే వున్నాయి. కానీ వాళ్లెవరు ఇప్పట్లో ఖాళీగాలేరు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ లేటవుతోందని అందరూ అనుకుంటున్నారు. నిజానికి మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా తానే నిర్మిస్తా అని బాలయ్యతో మాంచి అనుబంధం వున్న సాయి కొర్రపాటి ఎప్పుడో రుమాలు వేసేసారు.

అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ఏమిటంటే, మోక్షజ్ఞకు సినిమాల మీద అంతగా ఆసక్తిలేదు అని. మోక్షజ్ఞకు సినిమాల మీద కన్నా బిజినెస్ లేదా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం మీదనే ఆసక్తి ఎక్కువగా వుందని తెలుస్తోంది. బిజినెస్ రంగంలో పైకి ఎదుగాలని, ఎంతో సాధించాలని చాలా కలలు వున్నాయి కుర్రాడికి అని టాక్ వినిపిస్తోంది.

అయితే పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో బాలయ్య క్రమశిక్షణ అన్నది వేలుపెట్టి చూపించడానికి వీలులేనిది. అంత చక్కగా పెంచాడు ఆయన పిల్లలను. అందుకే తండ్రి సినిమాల్లోకి రమ్మంటే, మోక్షజ్ఞ కాదనే అవకాశం అంతగా వుండకపోవచ్చు. పైగా సినిమా హీరోకి కావాల్సిన లక్షణాలు అన్నీ వున్నాయి. అయితే మైండ్ సెట్ బిజినెస్ మీద నుంచి సినిమాల మీదకు మార్చుకోవాలంతే. అందుకు కాస్త టైమ్ పడుతుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?