Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కలెక్షన్లందు ట్విట్టర్ కలెక్షన్లు వేరయా

కలెక్షన్లందు ట్విట్టర్ కలెక్షన్లు వేరయా

ఖైదీ నెం 150 కలెక్షన్ల గురించి మళ్లీ లొల్లి మొదలైంది. ఇండస్ట్రీలో ఎప్పుడూ బ్లాక్  అండ్ వైట్ రెండు అక్కౌంట్లు వుంటాయన్నది అందరికీ తెలిసిందే. హీరోలకు, కాస్త పాపులర్ నటులకు రెండు విధాల పేమెంట్లు ఇవ్వాల్సిందే. అందువల్ల సినిమాకు అయ్యే ఖర్చు వేరు చూపించే ఖర్చువేరు. అలాగే అమ్మిన అమ్మకాల్లో కూడా బ్లాక్ వేరు, వైట్ వేరు. లాభాలన్నింటిపై టాక్స్ నిజాయతీగా కట్టేసేంత అమాయకులు ఎవరూ లేరు ఇండస్ట్రీలో. అది భారీ సినిమా అయినా, చిన్న సినిమా అయినా. మరి ఖైదీ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. పబ్లిసిటీ కోసం వంద కోట్ల కు పైగా షేర్ అన్నారు. 

అసలు మెగా హీరోల సినిమా అంటే చాలు ట్విట్టర్ లో, వాట్సప్ ల్లో కలెక్షన్లు క్రియేట్ చేసే జనాభా ఎలాగూ రెడీగా వుంటుంది. ఆ మాటకు వస్తే, ఎన్టీఆర్ మహేష్ బాబు లకు కూడా అలాంటి టీమ్ లు వున్నాయి కానీ, మెగా టీమ్ లంత పవర్ ఫుల్ కాదు.ఈ విద్యలో అంతగా ఆరితేరలేదు.

మరే సినిమాల కలెక్షన్లు మాత్రం సినిమా జనాలకు అందరికీ తెలియవు కానీ, మెగా సినిమాల కలెక్షన్లు అంటే సినిమా స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ల దగ్గర కూడా రెడీగా వుంటాయి. ఎందుకు అంటే ఇవన్నీ మెగా క్యాంప్ లో తయారై, చాలా తెలివిగా వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా చలామణీ అవుతాయి కాబట్టి. పైగా వీళ్లకు ఓ టెక్నిక్ వుంది. తొలిమూడు రోజులు పెర్ ఫెక్ట్ కలెక్షన్లు బయటకు వస్తాయి. ఆ తరువాత ఒక్కోరోజు ఒక్కో ఏరియాకు చిన్న చిన్న చిలక్కొట్టుడు మాదిరిగా కలపడం ప్రారంభవుతాయి. రెండు వారాలు అయిన తరువాత జనం దృష్టి కలెక్షన్లపై తగ్గుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు సిసలు కలపడం. అలా అలా కలుపుడు షురూ అవుతూనే వుంటుంది. 

ఇలాంటి కలెక్షన్లు కేవలం సినిమా ఫ్యాన్స్ వాదులాడ కోవడం కోసం, సవాళ్లు విసురుకోవడం కోసం, లెక్కలు చెప్పుకోవడం కోసమే. ఇన్ కమ్ టాక్స్ వాళ్ల కోసం. ఈ ట్విట్టర్, వాట్సప్, ఫేస్ బుక్ కలెక్షన్లు పట్టుకుని ఇన్ కమ్ టాక్స్ కట్టాలంటే నిర్మాతలు గుల్లయిపోతారు. అందువల్ల వీటపై లొల్లి ఎందుకు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?