Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కన్‌ఫ్యూజన్‌లో మహేష్‌, చరణ్‌!

కన్‌ఫ్యూజన్‌లో మహేష్‌, చరణ్‌!

ఒక్క ఫ్లాప్‌తో ఇద్దరు హీరోలు అయోమయంలో పడ్డారు!! ఆగడు పరాజయంతో మహేష్‌బాబు తన తదుపరి చిత్రం విషయంలో మరోసారి ఆలోచిస్తున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. కొరటాల శివతో మహేష్‌ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకి వెళ్లాల్సి ఉంది. 1, ఆగడు పరాజయాలతో మహేష్‌ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడట. వరుసగా మూడు విజయాల తర్వాత వచ్చిన రెండు పరాజయాలు మహేష్‌ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. 

కొరటాల శివ ‘మిర్చి’తో దర్శకుడిగా ముద్ర వేసినా కానీ ఇప్పుడు మహేష్‌ చాలా ప్రెజర్‌లో ఉన్నాడు. తన కంఫర్ట్‌ జోన్‌లో ఉండే సినిమాలు తీస్తాడో లేదో అనేది ఇంకా కొరటాల శివ ప్రూవ్‌ చేసుకోలేదు. కొరటాల చిత్రాలు మాస్‌ని ఆకట్టుకునే అంశాలతో ఉంటాయి. మహేష్‌ సినిమాల్లో వినోదానికి పెద్ద పీట వేయాలి. రెండు ఫ్లాప్స్‌ తర్వాత శివతో ఈ ప్రయోగం చేయాలా వద్దా అనేది మహేష్‌ డైలెమా అని ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు ఆగడుతో ఫెయిలైన శ్రీను వైట్ల అంతకుముందే చరణ్‌తో మలి చిత్రానికి కమిట్‌ అయ్యాడు. శ్రీను వైట్ల ఫార్ములాకి కాలం చెల్లిపోయిందని ఆగడుతో ప్రూవ్‌ అవడంతో అతనితో అలాంటి తరహా చిత్రం చేయడానికి చరణ్‌ సిద్ధంగా లేడు. పూర్తిగా తన స్టయిల్‌ మార్చుకుని కొత్త రకం కథతో వస్తేనే చరణ్‌ ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడని ఫిలింనగర్‌ టాక్‌. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?