Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కన్ఫూజన్ లో వెంకీ

కన్ఫూజన్ లో వెంకీ

సీనియర్ హీరో వెంకటేష్ భలే డోలాయమాన స్థితిలో చిక్కుకున్నారు. ఏ కొత్త డైరక్టర్నీ తెగించి నమ్మలేకపోతున్నారు. ఈ విషయంలో నాగార్జున మాదిరిగా ధైర్యం చేయలేకపోతున్నారు. సరైన రీమేక్ దొరికితే ఆనందంగా చేసేద్దాం అని వుంది. కానీ దొరకడం లేదు. స్ట్రయిట్ సినిమా చేద్దాం అంటే ధైర్యం సరిపోవడంలో లేదు. గతంలో విజయభాస్కర్, మెహర్ రమేష్ వాళ్లు ఇచ్చిన ఝలక్ లు ఇంతా అంతా కావు. దాంతో ఆయన ఎవర్నీ నమ్మలేకపోతున్నారు.

అదే రీమేక్ అయితే చకచకా చేసేవాడే. కానీ ఆ అవకాశం కనిపించడం లేదు. సీనియర్ డైరక్టర్లు ఎవరూ అందుబాటులో లేరు. అందుకే యూరమ్ సమ్మర్ ట్రిప్ నుంచి వచ్చేసినా కూడా ఇంకా కొత్త ప్రాజెక్టుపై డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. కథలు చాలా వస్తున్నాయి, డైరక్టర్లు కలుస్తున్నారు. కానీ వెంకీ మాత్రం డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎవరైనా సరైన రీమేక్ ప్రాజెక్టు తీసుకువచ్చే వరకు వెంకీ ఇలా వెయిట్ చేస్తూ వుంటారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?