Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దానయ్య అదృష్టవంతుడు

దానయ్య అదృష్టవంతుడు

నిర్మాత డివివి దానయ్య అదృష్టవంతుడు. సింగిల్ ఢమాకా కొసం చూస్తే, డబుల్ ఢమాకా దొరికేలా వుంది. నలభై యాబై కోట్ల సినిమా అనుకుంటే, ఇప్పుడు డెభై కోట్ల సినిమాగా మారిపోయేలా వుంది. రామ్ చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ సినిమాకు దానయ్యే నిర్మాత. ఫస్ట్ టైమ్ శ్రీనువైట్ల జాగ్రత్తగా బడ్జెట్ లో వెళుతున్నాడు. పైగా మళ్లీ కోన వెంకట్ అండ్ కో తో జతకలిసాడు. 

ఇప్పుడు దీనికి తోడ సినిమాలో చిరంజీవి వచ్చి చేరారు. సుమారు 10 నుంచి 20 నిమషాల పాత్ర అని వినికిడి. ఇది చాలక వీలయితే పాట పెట్టాలని కూడా ఆలోచిస్తున్నట్లు కూడా వినికిడి.  అదే జరిగితే మెగాభిమానులకు పూనకం వచ్చేస్తుంది. సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. దీనివల్ల డివివి కి పెరిగే అదనపు ఖర్చు మరీ పెద్దగా వుండదు కానీ, అమ్మకాల అంచనాలు మాత్రం ఓ రేంజ్ లో వుంటాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?