Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దానయ్యకు రాజమౌళి హ్యాండిస్తారా?

దానయ్యకు రాజమౌళి హ్యాండిస్తారా?

టాలీవుడ్ లో ఓ టాక్ వుంది. ఏ అడ్వాన్స్ తీసుకోని దర్శకుడి దగ్గర అయినా కూడా నిర్మాత డివివి దానయ్య అడ్వాన్స్ వుంటుందని. ఆచి తూచి అడ్వాన్స్ తీసుకునే దర్శకుడు రాజమౌళి దగ్గర కూడా దానయ్య అడ్వాన్స్ వుందీ అంటే ఈ టాక్ ను నమ్మాల్సిందే. అందుకే బాహుబలి 2 లాంటి ప్రచండ, ప్రపంచ బ్లాక్ బస్టర్ తరువాత అలాంటి టాప్ చెయిర్ డైరక్టర్ తో సినిమా చేసే అవకాశం దానయ్యదే అని తెలిసి, చాలా మంది అసూయ పడ్డారు. లక్కీ చాన్స్ అనుకున్నారు. అనుకుంటున్నారు.

కానీ టాలీవుడ్ లో ఇప్పుడు వేరే విధమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజమౌళి అస్సలు దానయ్యకు సినిమా చేయకపోవచ్చు అన్నది ఆ గుసగుసల సారాశం. చేయకపోతే ఏమవుతుంది? మహా అయితే చాంబర్ లోనో, ఇండస్ట్రీ పెద్ద మనుషుల దగ్గరో చిన్న పంచాయతీ. అడ్వాన్స్ తీసుకున్ననాటి నుంచి ఇప్పటి వరకు వడ్డీతో వెనక్కు ఇవ్వడం. బాహుబలితో వంద కోట్లకు పైగా లాభం చూసిన రాజమౌళికి ఇదేపాటి? అయితే వ్యవహారం మరీ రచ్చ కెక్కకుండా స్మూత్ గా జరిపించాలి. ఇండస్ట్రీలో మహా మహులంతా రాజమౌళి వెనుక వుండగా అదేమంత సమస్య కాదు.

గతంలో డైరక్టర్ మారుతితో ఇలాగే తకరారు వస్తే, అల్లు అరవింద్ సెటిల్ చేసారు. వడ్డీతో అడ్వాన్స్ వెనక్కు వెళ్లింది. అలాగే మరి కొందరు కూడా దానయ్య అడ్వాన్స్ లు వడ్డీతో వెనక్కు ఇచ్చారు. వీరిలో కొందరు హీరోలు కూడా వున్నారు. అందువల్ల ఇదేమంత కొత్త విషయం కాదు. రాజమౌళి ఆయన గురువు రాఘవేంద్రరావు, ఆయన కుటుంబ సభ్యులయిన బాహుబలి నిర్మాతలు అంత సులువుగా వదిలేలా లేరు. పైగా రాజమౌళి సన్నిహితుడు నిర్మాత సాయి కొర్రపాటికి ఓ సినిమా చేసే ఆలోచన రాజమౌళికి ఎప్పటి నుంచో వుంది. ఇలాంటివి అన్నీ వుండడంతో ఈ తరహా టాక్ వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?