Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దసరాకు శాతకర్ణి టీజర్

దసరాకు శాతకర్ణి టీజర్

బాలయ్య అభిమానులకు శుభవార్త. శాతకర్ణి టీజర్ రెడీ అయిపోయింది. అయితే దసరా పండుగ నాడు విడుదల చేయడం కోసం అలా వుంచారు. టీజర్ సూపర్ గా వుందని, అభిమానులకే కాదు, సినిమా లవర్స్ కు కూడా బాగా నచ్చుతుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. బాలకృష్ణ వందవ సినిమా ఇది. 

అందువల్ల ఈ సినిమాకు ఒక ప్లాన్డ్ గా హైప్ తీసుకురావాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు. అంతే కాదు, ఇంతవరకు క్రిష్ అనేక సినిమాలు తీసారు. విజయాలు వున్నాయి, అపజయాలు వున్నాయి. మంచి డైరక్టర్ గా పేరు వుంది. కానీ కమర్షియల్ గా టాప్ డైరక్టర్ల జాబితాలో ఆయన లేరు. 

అందుకే ఈసారి ఈ సినిమాతో వంద కోట్ల మార్కు సాధించాలని ఆయన పట్టుదలగా వున్నారు. బాలయ్య హీరోగా కావడం, వందవ సినిమా కావడం, అది కూడా చరిత్ర నేపథ్యంలో వస్తున్న భారీ సినిమా కావడంతో క్రిష్ ఈ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?