Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దాసరి.. పవన్‌.. చెక్‌ పెట్టేదెప్పుడు.?

దాసరి.. పవన్‌.. చెక్‌ పెట్టేదెప్పుడు.?

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌.. కాదు కాదు ఇంకొకరితో ఫిక్స్‌ అయ్యింది. అవేవీ కాదు, పవన్‌కళ్యాణ్‌ డైరెక్షన్‌ చేస్తాడు.. సినిమా టైటిల్‌ ‘సత్యాగ్రహి’.. అది కాదు, ‘సర్దార్‌’.. ఇలా కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ వస్తున్నాయి దాసరి నారాయణరావు నిర్మించనున్న పవన్‌కళ్యాణ్‌ సినిమాకి సంబంధించి.

ఏది నిజం.? ఏది అబద్ధం.? అంటే దాసరి నారాయణరావు నుంచిగానీ, పవన్‌కళ్యాణ్‌ నుంచిగానీ నో కామెంట్‌. సమయమొచ్చినప్పుడు దాసరిగానీ, పవన్‌గానీ స్పందించొచ్చేమోగానీ.. అప్పటిదాకా ఈ గాసిప్స్‌ మాత్రం పవన్‌ అభిమానుల్ని కన్‌ఫ్యూజ్‌ చేసేస్తున్నాయి.

అసలే పవన్‌ చేయాల్సిన సినిమాల లిస్ట్‌ పెరిగిపోతోంది. ఏ సినిమా ఎవరితో చేస్తాడో అభిమానులకే తెలియడంలేదు. డాలీకి మాటిచ్చాడు, ‘గబ్బర్‌సింగ్-2’కి కమిట్‌ అయ్యాడు. ఇంతలోనే దాసరి, పవన్‌తో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించేశారు. త్రివిక్రమ్‌తో పవన్‌ ‘కోబలి’ చేయాల్సి వుంది. ప్రస్తుతానికైతే ‘గబ్బర్‌సింగ్‌-2’ సెట్స్‌మీదకు రావడమొక్కటీ పక్కా. మిగతా సినిమాలు ఎప్పుడు సెట్స్‌ మీదకు వస్తాయో, గాసిప్స్‌ ఎన్ని నిజమవుతాయో వేచి చూడాల్సిందే.

ఇక, దాసరి - పవన్‌ కాంబినేషన్‌లో రానున్న మూవీకి సంబంధించి విన్పిస్తున్న గాసిప్స్‌కి అతి త్వరలో చెక్‌ పెట్టేందుకు దాసరి ప్రయత్నిస్తున్నారట. అంటే క్లారిటీ ఇవ్వనున్నారనేగా అర్థం.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?