Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డిసిఎమ్ నా? బొలెరో నా?

డిసిఎమ్ నా? బొలెరో నా?

తొమ్మిది వేల కోట్ల నగదు పట్టేంత వెహికిల్ ఏది? డిసిఎమ్ వ్యాన్ కావాలా? బొలెరో వ్యాన్ సరిపోతుందా? డిజె క్లయిమాక్స్ లో హీరో బొలెరొ వ్యాన్ లో తొమ్మిది వేల కోట్ల నగదు తెస్తాడు.

అదెలా సాధ్యం? అంతకన్నా సగం మొత్తానికే జులాయి సినిమాలో హెవీ కంటైనర్ లారీని వాడారు. ఈ అనుమానం రెండు సినిమాలు చూసిన ప్రేక్షకులకే కాదు, క్లయిమాక్స్ షూట్ చేస్తున్నపుడు డిజె యూనిట్ జనాలకు కూడా వచ్చిందట.

యూనిట్ జనాలు పలువురు, హెవీ కంటైనర్ కాకపోయినా, కనీసం డిసిఎమ్ ను వాడాలని అభిప్రాయపడ్డారట. లక్షకు ఎన్ని నోట్లు, కోటికి ఎన్ని కట్టలు, తొమ్మిదివేల కోట్లకు ఎన్ని కట్టలు, ఎంత స్పేస్ అని కూడా లెక్కలు కట్టారట.

అయితే జులాయి తీసినపుడు వెయ్యి రూపాయిల నోట్లు, ఇప్పుడు రెండు వేల రూపాయిల నోట్లు. అందువల్ల బొలెరో వ్యాన్ చాలు అని దర్శకుడు హరీష్ శంకర్ కచ్చితంగా చెప్పేసి ఆ విధంగానే ముందుకు వెళ్లాడట, ఎంత రెండు వేల నోట్లు అయినా, తొమ్మిదివేల కోట్లకు ఓ చిన్న బొలెరో వ్యాన్ సరిపోతుందా? అనుమానమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?