Advertisement


Home > Movies - Movie Gossip
దీపికా పదుకోన్ నిశ్చితార్థం పూర్తయింది..?

ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే గాసిప్ జోరుగా నడుస్తోంది. హీరో రణ్వీర్ సింగ్, హీరోయిన్ దీపిక పదుకోన్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ అయిందంటూ బాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా దీపికా పదుకోన్ తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకుంది. ఈ పుట్టినరోజును రణ్వీర్ సింగ్ స్పెషల్ గా ప్లాన్ చేశాడు.

రణ్వీర్ కుటుంబసభ్యులు, దీపిక కుటుంబ సభ్యులు కలిసి ఓ హాలిడే టూర్ కు వెళ్లారు. పుట్టినరోజు సందర్భంగా దీపికకు డైమండ్ నెక్లెస్, డిజైనర్ చీరను తన తల్లి ద్వారా బహుమతిగా అందించాడు రణ్వీర్ సింగ్. అదే సందర్భంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్లిద్దరూ రింగులు మార్చుకున్నారట.

వీళ్ల బర్త్ డే పార్టీ కమ్ ఎంగేజ్ మెంట్ శ్రీలంకలో జరిగిందని కొందరు అంటుంటే.. మాల్దీవుల్లో జరిగిందని మరికొందరంటున్నారు. ముంబయి ఎయిర్ పోర్ట్ లో మాత్రం వీళ్లిద్దరూ చేతిలో చేయి వేసుకుంటూ ఉల్లాసంగా కనిపించారు. నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

కనీసం ఏడాదికి ఒకసారి దీపిక, రణ్వీర్ ఇలా కుటుంబసభ్యులతో కలిసి పర్యటనలకు వెళ్లి రావడం కామన్. గతేడాది వీళ్లిద్దరూ లండన్ వెళ్లొచ్చారు. నిజానికి అప్పుడే వీళ్లిద్దరికి నిశ్చితార్థం పూర్తయిందంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిని ఈ జంట ఖండించింది. దీపిక తండ్రి ప్రకాష్ చెబుతున్న మాటలు వింటే ఈసారి మాత్రం ఎంగేజ్ మెంట్ అయినట్టే ఉంది. "వాళ్లిద్దరూ మేజర్స్. ఏం చేస్తున్నారో వాళ్లకు బాగా తెలుసు. నేనైతే దీపికకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఆమె నిర్ణయం ఆమె ఇష్టం" అంటున్నాడు ప్రకాష్.