Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దేవరకొండ సినిమా క్యాన్సిల్?

దేవరకొండ సినిమా క్యాన్సిల్?

మణిరత్నం పక్కన నాని.. మణిరత్నం పక్కన రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ లో తలా పేరు వినిపిస్తూనే వచ్చింది గడచిన రెండేళ్లుగా. దాదాపు తెలుగు యంగ్ హీరోలు అందరూ అయిపోయారు. ఆఖరిన వినిపించిన పేరు విజయ్ దేవరకోండ దే. అర్జున రెడ్డి తరువాత కొన్నాళ్ల పాటు విజయ్ పేరు మోత మోగిపోయింది. అతను ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నాడో అన్నది మాత్రం పైకి రాలేదు. గీతా ఆర్ట్స్ లో పరుశురామ్ డైరక్షన్ లో ఓ సినిమా రెడీ అవుతోందని మాత్రం తెలుసు.

దాంతో విజయ్ పేరు ముడిపెడుతూ చాలా ప్రాజెక్టుల పేర్లు బయటకు వచ్చాయి. అలాంటి వాటిలో మణిరత్నం సినిమా ఒకటి. అప్పుడే నిజానికి జనం లైట్ తీసుకున్నారు. ఎందుకంటే రామ్ చరణ్, అఖిల్ తో సహా చాలా మంది పేర్లు మణిరత్నం కాంబోకి ముడిపెడుతూ విని విని వున్నారు కాబట్టి, దీన్నీ లైట్ తీసుకున్నారు. ఆఖరికి ఇప్పుడు ఇది కూడా క్యాన్సిల్ అని కొత్త వార్తలు పుట్టుకువచ్చాయి.

నిజానికి మణిరత్నంతో ప్రాజెక్టు వుందో లేదో అన్నది పక్కాగా తెలియదు. వార్తలు అయితే పుట్టుకువచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు పురిటిలోనే పక్కకుపోయాయి. మళ్లీ మరో హీరోతో ముడిపెడుతూ మణిరత్నం పేరు ఎప్పుడు మళ్లీ వార్తల్లోకి వస్తుందో అన్నది చూడాలి. ఆ విషయం అలా వుంచితే అర్జున్ రెడ్డి వచ్చి నాలుగు నెలలు దాటిపోతోంది. తరువాతి సినిమా విడుదల డేట్ రావడం లేదు దేవరకొండ నుంచి. మరోపక్క యంగ్ హీరోలు అంతా చకచకా సినిమాల డేట్లు ప్రకటిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?