Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బిగ్ బి.. బాలయ్యను అవమానించినట్టేనా?

బిగ్ బి.. బాలయ్యను అవమానించినట్టేనా?

ఆ మధ్య ‘రైతు’ అని ఒక కాన్సెప్టును పట్టుకుని నందమూరి నటసింహం బిగ్ బి అమితాబ్ ను కలిసింది. రాంగోపాల్ వర్మ సినిమా ‘సర్కార్ 3’ సెట్స్ మీద అమితాబ్ ను కలిశాడు నందమూరి బాలయ్య. తను హీరోగా నటిస్తున్న సినిమా అని, అందులో ఒక అద్భుతమైన పాత్ర ఉందని.. దాన్ని చేయాలని అమితాబ్ కు విన్నవించాడు బాలయ్య. దానికి అమితాబ్ సంకోచం ఏమీ లేకుండా నో చెప్పాడు.

అదేమంటే.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయని అమితాబ్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆరు నెలల వరకూ ఖాళీ కాలేను అని బాలయ్యకు వివరించాడట బిగ్ బి. మరి బిగ్ బి ఆన్సర్ అలా ఉంటే.. ఇవతల రైతు దర్శకుడు కృష్ణ‌వంశీ, హీరో బాలయ్యలు మాత్రం.. అమితాబ్ నో అన్నాడని చెప్పి, ఆ ప్రాజెక్టునే ఆపేసినట్టుగా ప్రకటించారు. అమితాబ్ ఓకే అని ఉంటే.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేది కానీ, ఆయన నో చెప్పాడని.. అందుకే ఆ ప్రాజెక్టును ఆపేసినట్టుగా వారు ప్రకటించారు.

మరి ఒక సినిమా రకరకాల రీజన్లతో ఆగిపోవచ్చు. కానీ.. అందులో ఒక క్యారెక్టర్ చేయాల్సిన నటుడు నో చెప్పాడని ఆ సినిమా ఆగిపోవడం అంటే మాటలు కాదు. అందులోనూ నందమూరి నటసింహం సినిమా. మరి బిగ్ బి మీద వారు అన్ని ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ.. ఇప్పుడు బాలయ్యకు ఝలక్ ఏమిటంటే.. చిరంజీవి సినిమాకు బిగ్ బి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.

‘సైరా.. నరసింహారెడ్డి’ అఫిషియల్ అనౌన్స్ మెంట్ లో బిగ్ బి ఫొటోను కూడా వాడేశారు. కాబట్టి.. అందులో బిగ్ బి నటిస్తున్నట్టే. ఇక సందేహం ఏమీ లేదు. మరి బాలయ్య సినిమాకు అడిగితే ‘అబ్బే.. వీలుకాదు’ అని చెప్పడం, చిరంజీవి సినిమాకు మాత్రం ‘సై’ అనడం.. ఆసక్తికరంగా ఉంది. ఇది ఒక రకంగా బాలయ్యను అవమానించినట్టేనేమో.. అనే అభిప్రాయం కలగకమానదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?