Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు కలవరం?

దిల్ రాజు కలవరం?

నిర్మాత దిల్ రాజు సదా చిద్విలాసంగా వుంటారు. కలవరం అన్నది తెలియదు. కానీ ఇప్పుడు కాస్త టెన్షన్ పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని హీరోగా ఆయన నిర్మించి ఎంసిఎ సినిమా గురించే ఈ కలవరం. ఆ సినిమాను పట్టుపట్టి ఈ నెల 21న విడుదలకు రెడీ చేస్తున్నారు. కానీ సినిమాకు రావాల్సినంత బజ్ రాలేదు. రావడం లేదు.

మరోపక్క దానికి పోటీగా వస్తున్న హల్లో సినిమా పబ్లిసిటీలో దూసుకుపోతోంది. నాగార్జున అన్నీ తానై ఆ సినిమాకు బజ్ తీసుకురావడానికి తెగ కష్టపడుతున్నారు. పైగా ఆడియో ఫరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. 

కానీ నాని నటించిన ఎంసిఎ ఆడియోకి అన్ని మార్కులు రాలేదు. పైగా ఈ సినిమాకు డైరక్టర్ వేణు శ్రీరామ్. ఆ పేరు కూడా అంత బజ్ వున్న పేరు కాదు. ఇక ఏం మోసినా, నాని, దిల్ రాజు ఇద్దరే మోయాలి. ఆడియో ఫంక్షన్ దగ్గరలో వుంది. సినిమా విడుదల కూడా ఇంక  రోజుల్లోకి వచ్చేసింది. ఈ లోగా ఓ పాటను రీప్లేస్ చేసి మాంచి మాస్ సాంగ్ ఏదైనా జోడించడానికి అవుతుందా? అనే డిస్కషన్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేవీశ్రీప్రసాద్ తో దిల్ రాజు మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు భరోసా అంతా నాని మీదే. సినిమా ఆ మాత్రం, ఈమాత్రం వుంటే చాలు. నాని లాక్కుని వెళ్లిపోతాడన్నది ఓ లెక్క. కానీ ప్రతి సినిమాకు అలాగే అంటే అవుతుందా? అన్నది చూడాలి. నేను లోకల్ ను అలాగే లాక్కు వెళ్లాడు. మరి దీన్నేం చేస్తాడో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?