Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజుకు థియేటర్ల సమస్య

దిల్ రాజుకు థియేటర్ల సమస్య

రాష్ట్రంలో థియేటర్లను ఎక్కువగా లీజుకు తీసుకున్న వారిలో దిల్ రాజు ఒకరు అని అందరూ చెబుతారు. ఇప్పుడు ఆయనకే థియేటర్లు అన్నది తలకాయ నొప్పిగా మారిందట. ముఖ్యంగా నైజాంలో. అదెలా అంటే.

ఆయన స్వంత సినిమా ఫిదా థియేటర్లలో వుంది. వాస్తవానికి ఫిదా విడుదలైన వారానికి గౌతమ్ నందా వస్తుంది కాబట్టి, కొన్ని థియేటర్లు ఖాళీ చేసి ఇవ్వవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫిదాను థియేటర్లలోంచి తీసే పరిస్థితి కనిపించడంలేదు. సరే ఏదో విధంగా గౌతమ్ నందాకు సురేష్, గీతా, ఏసియన్ వాళ్ల నుంచి థియేటర్లు తీసుకుని ఇస్తారు అనుకుంటే, 4న దర్శకుడు సినిమా వస్తోంది. దానికీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజునే. గౌతమ్ నందాను మరీ వారంలో థియేటర్లల్లోంచి లేపే పరిస్థితి వుంటుందని అనుకోవడానికి లేదు.

మరి అలాంటపుడు ఎలా? పోనీ ఫిదా, గౌతమ్ నందా, దర్శకుడు కిందా మీదా సెట్ చేసుకుంటారు అనుకుంటే, 11న జయ జానకి నాయక వుంది. అది కూడా దిల్ రాజునే పంపిణీ దారుడు. అప్పుడు ఇంకా సమస్య ఏమిటంటే అదేరోజు నేనే రాజు నేనే మంత్రి విడుదల. సురేష్ థియేటర్లు, ఏసియన్ థియేటర్లు అన్నీ దానికే రిజర్వ్. గౌతమ్ నందా, దర్శకుడు కూడా హిట్ అనిపించుకుంటే, 11న భలే తలకాయనొప్పి వస్తుంది దిల్ రాజుకు థియేటర్లు సెట్ చేయలేక.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?