Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు...మీడియా సెన్సార్?

దిల్ రాజు...మీడియా సెన్సార్?

నిర్మాత దిల్ రాజుకు టాలీవుడ్ మీడియాకు కాస్త ఎప్పుడూ చిన్న చిన్న మిస్ అండర్ స్టాండింగ్ లు మామూలే. ఇప్పుడు ఇది మళ్లీ మరోసారి మొదలైనట్లు వినికిడి. కొన్ని చానెళ్లు, కొంత మీడియాకే ప్రకటనలు ఇవ్వాలని 14 మంది నిర్మాతలు నిర్ణయించడం వెనుకు కీలక పాత్ర దిల్ రాజు దే అని తెలుస్తోంది. దాంతో దాదాపు చాలా చానెళ్లు దిల్ రాజు పాల్గొన్న సమావేశాలను సెన్సారు చేయాలని అనధికారికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

సమావేశం మొత్తం ఏ మీడియా చూపించలేదు. ఎడిట్ చేసి ముఖ్యమైన ప్రసంగాలు, విషయాలు చూపిస్తారు. మిగిలినవి ఎగిరిపోతాయిు. ఇప్పుడు అలా ఎగిరిపోయే వాటి జాబితాలో దిల్ రాజును కూడా చేర్చినట్లు తెలుస్తోంది. అంటే దిల్ రాజు మొహం, ప్రసంగం చానెల్ లో కనిపించదన్నమాట. 

మొత్తానికి నిర్మాతల వ్యవహారం బాగానే రాజుకుంటోంది. ఒక్క పక్క ఆంధ్ర జ్యోతి హీరోలను తూర్పారపడుతోంది. దాంతో హీరోలు నిర్మాతలపై మండి పడుతున్నట్లు తెలుస్తోంది.మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లనే ఇదంతా వచ్చిందని అంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దిల్ రాజు వ్యవహారం. ఇది ఇంకా ఏమేరకు ముదురుతుందో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?