Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్ రాజు-నాగ్-శ్రీనివాస కళ్యాణం

దిల్ రాజు-నాగ్-శ్రీనివాస కళ్యాణం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి సినిమాలతో తెలుగు జనాల సెంటిమెంట్ నాడిని పట్టేసుకున్నారు నిర్మాత దిల్ రాజు. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు విడుదల చేస్తే, ష్యూర్ హిట్ అని అర్థమైపోయింది. అందుకే వచ్చే సంక్రాంతికి కూడా ఇలాంటి సినిమాను ప్లాన్ చేస్తున్నారు. శతమానం భవతి సినిమా అందించిన డైరక్టర్ సతీష్ వేగ్నశ డైరక్షన్ లోనే శ్రీనివాస కళ్యాణం అనే సినిమాను ప్లాన్ చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ టైటిల్ రిజిస్టర్ చేసారు. వెంకటేశ్వరుని భక్తుడైన దిల్ రాజు ఇప్పుడు ఈ టైటిల్ కు, కథకు తగ్గ హీరోను కూడా ఫిక్సయ్యారు. అయితే హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి వుంది. దిల్ రాజు అయితే నాగార్జునతోనే ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారు. 

ప్రస్తుతం నాగ్ రాజుగారి గది 2 షూట్ లో వున్నారు. ఆ తరువాత ఏదీ ఇంకా ఫిక్స్ కాలేదు. డిస్కషన్లలోనే వున్నాయి. అందుకే ఈ గ్యాప్ ను తను తీసుకోవాలని దిల్ రాజు చూస్తున్నట్లుంది. నాగ్ సై అంటే, సంక్రాంతికి శ్రీనివాస కళ్యాణం జరిగిపోతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?