Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అడ్డంగా బుక్కయిన దిలీప్, హైకోర్టులో కూడా కష్టమే?

అడ్డంగా బుక్కయిన దిలీప్, హైకోర్టులో కూడా కష్టమే?

బెయిల్ దొరుకుతుందేమో అనే ఆశ మొన్నటివరకు ఉండేది. కానీ కేరళ హైకోర్టులో ప్రవేశపెట్టిన సాక్ష్యాలు చూసిన వాళ్లకు ఎవరికైనా దిలీప్ కు బెయిల్ కష్టమే అనిపించక మానదు. సుదీర్ఘ వాదనల తర్వాత దిలీప్ బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో పెట్టింది కేరళ హైకోర్టు.

హీరోయిన్ భావనపై లైంగిక దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు దిలీప్. 2వారాల జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా ఎన్నో కీలకమైన సాక్ష్యాల్ని సేకరించారు కేరళ సిట్ పోలీసులు. ఇందులో భాగంగా దిలీప్ మొబైల్ ను కూడా బ్రేక్ చేశారు. కీలక నిందుతుడు పల్సర్ సునీతో దిలీప్ జరిపిన భేటీ వివరాల్ని కూడా కోర్టుకు సమర్పించారు.

భావనను అత్యాచారం చేసి వీడియో చిత్రీకరించాల్సిందిగా పల్సర్ సునీని దిలీప్ కలిశాడు. ఫస్ట్ మీటింగ్ లో 10వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత గుర్తుతెలియని వ్యక్తి ఖాతా నుంచి సునీ ఎకౌంట్ లోకి లక్ష రూపాయలు ట్రాన్సఫర్ అయ్యాయి. భావనపై లైంగిక దాడి జరగడానికి ముందు, జరిగిన తర్వాత 4సార్లు దిలీప్-సునీ భేటీ అయ్యారు. వీటితో పాటు సునీతో దిలీప్ మాట్లాడిన కాల్ సంభాషణల్ని కూడా కోర్టుకు సమర్పించారు. 

ఇలా తనకు వ్యతిరేకంగా తిరుగులేని సాక్ష్యాలు దొరకడంతో దిలీప్ మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. బెయిల్ కోసం హైకోర్టుకు ఎందుకు వెళ్లాన్రా బాబు అని తనలో తానే బాధపడుతున్నాడు. మరోవైపు భావనపై లైంగిక దాడికి సంబంధించి గతంలో జైలు నుంచి దిలీప్ కు అందిన లేఖను కూడా విశ్లేషించి సాక్ష్యంగా ప్రవేశపెట్టేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. 

ఇదంతా ఒకెత్తయితే కనిపించకుండా పోయిన దిలీప్ అసలు ఫోన్ మరో ఎత్తు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన మొబైల్ సాక్ష్యాలు దిలీప్ వాడుతున్న రెండో ఫోన్ కు సంబంధించినవి. అసలు ఫోన్ కనిపించడం లేదు. అది కూడా దొరికితే దిలీప్ కు జైలు జీవితం దాదాపు ఖరారైపోయినట్టే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?