Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డైరక్టర్ కు మ్యూజిక్ సిట్టింగ్స్ కు కూడా నో ఎంట్రీ

ఇటీవల విడుదల ఢమాల్ మందో సినిమా. కాస్తో కూస్తో చరిష్మా వున్న హీరో..కొత్త డైరక్టర్..సినిమా అట్టర్ డిజాస్టర్ అయిన తరువాత వస్తున్నాయి అసలు విషయాలు బయటకు. ఈ సినిమా మేకింగ్ మొత్తం సదరు హీరో కనుసన్నలలోనే జరిగిందని. ఆఖరికి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చాలా వరకు డైరక్టర్ లేకుండా జరిగిపోయాయట. టేక్ చేద్దామా అని డైరక్టర్ అనేలోపే..కట్..ఓకె అని హీరో నుంచి వినిపించి, షాట్ పూర్తయిపోయేదట.

అవకాశం ఇచ్చారు..మధ్యలో తప్పుకుంటే కెరీర్ కే ముప్పు అని మౌనంగా భరించుకువచ్చిన సదరు డైరక్టర్, ఇప్పుడు సినిమా డిజాస్టర్ అయ్యి, అందరూ తననే వేలెత్తి చూపుతుంటే, దగ్గర వాళ్ల దగ్గర సంగతులన్నీ చెప్పుకుని ఘొల్లు మంటున్నాడట.

ఇలాంటి అనుభవాలు సదరు హీరో దగ్గర ఇంతకు ముందు డైరక్టర్లకు కూడా కాస్త రుచి చూసిన వైనం వుంది కానీ, మరీ ఇంతలా డైరక్టర్ ను పక్కన వుంచి, తానే సినిమా మొత్తం చుట్టేసిన సంగతి మాత్రం లేదట. ఏం చేస్తాం..అలాంటి వాటికి ఇలాంటి ఫలితమే వుంటుంది మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?