Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నీచంగా తిట్టేసుకుంటున్న దర్శకులు

నీచంగా తిట్టేసుకుంటున్న దర్శకులు

నంది అవార్డుల విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రచ్చరచ్చ అవుతోంది. ఏపీ ప్రభుత్వం మూడుసంవత్సరాలకు ఒకేసారి నంది అవార్డులను ప్రకటిస్తే.. విజేతలను ఎంపిక చేసిన తీరు మీద అసంతృప్తులు, సెటైర్లు, వెటకారాలు అనేకం సాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నంది అవార్డులకు ఎంపిక చేసిన కమిటీలకే అవార్డులు ఇవ్వాలంటూ వెటకారాలు ఆడారు.

అయితే ఇది ఇంకాస్త సీరియస్ అవుతోంది. తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి మద్దినేని రమేష్ ఈ విషయంలో చాలా షార్ప్ గా రియాక్ట్ అయ్యారు. రాంగోపాల్ వర్మ పేరు ప్రస్తావించకుండానే.. ఆయన గురించి వ్యాఖ్యానిస్తున్నట్లుగా అభిప్రాయం కలిగే విధంగా తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా విరుచుకుపడ్డారు.

రాంగోపాల్ వర్మ మాటల్లోని సెటైర్ కు మద్దినేనికి అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు గానీ.. ఒక రేంజిలో తిట్ల పర్వం అందుకున్నాడు. నిజానికి చాలా నీచమైన తిట్లుకూడా ఇందులో ఉన్నాయి. గతంలో పరిశ్రమలోని వ్యక్తుల మధ్య ఎన్నో వివాదాలు నడిచాయి.. అలాంటివి సహజంగా ఎప్పుడూ ఉంటాయి కూడా. అయితే ఇంత నీచంగా తిట్టుకున్న సందర్భాలు మాత్రం లేవని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మద్దినేని రమేష్ మొత్తం నంది అవార్డుల కమిటీల వారి తరఫున అన్నట్లుగా తీవ్ర పదజాలంతో చెండాడేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

మద్దినేని రమేష్ ఎఫ్‌బీ పోస్ట్ ను యథాతథంగా ఇక్కడ అందిస్తున్నాం.. చదవొచ్చు.

‘‘నంది అవార్డ్స్ కమిటీలకు అవార్డ్స్ ఇవ్వాలన్న దర్శకుడా... తెలుగులో సినిమా తీయనని పారిపోయి ముంబై వెళ్ళి అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన నువ్వా మాట్లాడేది... నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదా... ఈ సమాజం మీద నాకు భాద్యత లేదని కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిననీకు నంది అవార్డ్స్ మీ మాత్రం భాద్యత గౌరవం వచ్చాయా.. తెలుగుజాతి ఖర్మ...

నిజాయితీగా పనిచేసిన మా 2016కమిటీ గురించి మాత్ర్లడీతవె ఒప్పుకోం... దేశంలో ఇన్నిరకాల జడ్యాలు పెడదోరనులు వ్యత్యాసాలు అంటరానితరాలు వుంటేకనపడవు కోట్లుకు కోట్లు నిర్మాతల సొమ్ముతింటూ వాళ్లను కనీసం మనుషులుగా గుర్తించని కుటుంబాలకు వీధొక భానిస బఫూన్ ప్రయివేట్ సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని బతుకు నీదొ ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే ఖబద్దార్.. బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ ఇక్కడెవడూ బయపడెవారు లేరు ... ఖబడ్దార్.. మీ తోక ఊపుల్లు పిల్లల దగ్గర చుపండి పులుల దగ్గర కాదు’’

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?