Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డిజె వద్దన్న పూజా హెగ్డే

డిజె వద్దన్న పూజా హెగ్డే

ఒక్కోసారి ఒక్కో నిర్ణయం కెరీర్ ను అటు ఇటు మార్చేస్తుంది. రెండు తెలుగు సినిమాల తరువాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది హీరోయిన్ పూజ హెగ్డే. అక్కడ ఇంక దున్నేస్తాను అనుకుంది. దానికి తోడు అక్కడ చేసిన సినిమా అగ్రిమెంట్ కూడా ఆమెను మరో సినిమా టచ్ చేయడానికి లేకుండా లాక్ చేసింది.

దాంతో తెలుగులో ఒకరిద్దరు మెగా హీరోల పక్కన ఆఫర్లు వచ్చిన నో చెప్పక తప్పలేదు. బాలీవుడ్ లో పరాజయం పలకరించాక కూడా, అక్కడి సర్కిల్ జనాలంతా టాలీవుడ్ కు వెళ్లవద్దనే సలహా ఇచ్చారట. బాలీవుడ్ నే బెటర్ అన్నారట.

ఇలాంటి టైమ్ లో డిజె ఆఫర్ వస్తే కూడా పూజ పెద్దగా ఆసక్తికనబర్చలేదట. దాంతో అరవింద్ ఫ్యామిలీకి దగ్గరైన ఓ నిర్మాత చొరవ తీసుకుని, పూజకు టాలీవుడ్ లో కంటిన్యూ అయితేనే బాగుంటుందని, ఇక్కడ హీరోయిన్ల షార్టేజ్ బాగా వుందని చెప్పి ఒప్పించారట.

ఇదే ఇప్పుడు పూజకు వరంగా మారింది. డిజె సినిమాలో పూజ ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. ఆఫర్లు పరుగెత్తుకు వస్తున్నాయి. 70 లక్షలకు డిజె సినిమా చేసిన పూజా కోటిన్నర డిమాండ్ చేస్తోంది ఇప్పుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?