Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డీజే వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది అందుకే..?

డీజే వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది అందుకే..?

ఉగాది సందర్భంగా సడెన్ గా తెరపైకొచ్చాడు డీజే. అప్పటికే చాలా ఫస్ట్ లుక్స్, ఉగాది శుభాకాంక్షలతో పోస్టర్లు వచ్చాయి. ఇక సందడి అయిపోయిందనుకునే టైమ్ లో డీజే వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోందంటూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. నిజానికి ఉగాది సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేస్తే సరిపోతుంది. కానీ డీజే టీం మాత్రం ఇంకాస్త ఎక్కువ చేయడానికి కారణం, ఆ సినిమాపై తాజాగా వస్తున్న పుకార్లే.

దువ్వాడ జగన్నధమ్ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. బన్నీకి సర్జరీ జరిగిందని, అందుకే డీజే షూటింగ్ ను అర్థాంతరంగా ఆపేసినట్టు కథనాలు వచ్చాయి. ఈమధ్య ముఖానికి మాస్క్ వేసుకొని బన్నీ నడిచొస్తున్న స్టిల్ ఒకటి బయటకు రావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.

సో.. డీజే సినిమా షూటింగ్ ఆగిపోలేదని చెప్పేందుకే ఇంత హడావుడి చేసింది యూనిట్. ప్రస్తుతం ఓ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నామని, టోటల్ సినిమాకే ఆ సాంగ్ హైలెట్ అవుతుందంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

మరోవైపు ఈ సినిమా విడుదలపై కూడా డౌట్స్ పెరిగిపోతున్నాయి. లెక్కప్రకారం సినిమా మే నెలలో విడుదల కావాలి. కానీ ఇప్పుడు మే బాక్సాఫీస్ నుంచి డీజే తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దువ్వాడ టీం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?