Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దూకుడు హీరో ఎవరో?

దూకుడు హీరో ఎవరో?

భలే పిచ్చి ప్రశ్న..మహేష్ బాబే కదా అని అనేయద్దు తొందరపడి. విషయం టాలీవుడ్ ది కాదు, బాలీ వుడ్ ది. నిర్మాత అనిల్ సుంకర, దూకుడు సినిమాను బాలీవుడ్ లో తీయాలనుకుంటున్నారు. అప్పట్లోనే సల్మాన్ ను అడిగారు. ఆయన కూడా సౌత్ సబ్జెక్ట్ ల మీద చాలా హుషారుగా వున్నారు అప్పట్లో. అయితే అన్నీ వరుసగా పోలీసు పాత్రలు అవుతున్నాయని, ‘దూకుడు’ తగ్గించారు. 

ఇప్పుడు మళ్లీ అనిల్ సుంకర బాలీవుడ్ పై దృష్టి పెట్టారు. మాంచి కమర్షియల్ హీరోను సెట్ చేసుకుని దూకుడు హిందీ వెర్షన్ తీస్తామని అంటున్నారు. జేమ్స్ బాండ్ కమర్షియల్ గా గట్టెక్కేసిందని, ఇప్పుడు చేతిలో మరో ప్రాజెక్టు ఏదీ రెడీగా లేనందున, ఇప్పుడు దూకుడు బాలీవుడ్ ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టారట అనిల్ సుంకర.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?