Advertisement


Home > Movies - Movie Gossip
డ్రగ్స్ మాఫియా కేరాఫ్ ‘నక్షత్రం’

కొన్ని సినిమాలు భలే టైమ్లీగా కుదురుతాయి. అనుకోకుండా అలా జరుగుతూ వుంటుంది. ఇప్పుడు నడుస్తున్న సీజన్ డ్రగ్స్ దాని వెనుక దాగిన జనాలు. మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న నక్షత్రం సినిమా నేపథ్యం కూడా ఇదేనట. డైరక్టర్ కృష్ణవంశీ అందిస్తున్న ఈ సినిమాలో డ్రగ్స్ మాఫియా, దాని కారణంగా బలైపోయిన ఓ పోలీసు ఆఫీసర్, ఆ హత్య రహస్యాన్ని ఛేదించే యువకుడి కథే కీలకంగా వుంటుందట.

విక్రమార్కుడు సినిమాలో మాదిరిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సాయి ధరమ్ తేజ కనిపిస్తాడు. డ్రగ్స్ మాఫియా ఆట కట్టించే క్రమంలో అతని పాత్ర ముగుస్తుంది. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్న సందీప్ కిషన్, అసలు ఆ హత్య వెనుక దాగిన వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తాడు.

సినిమా సాయి ధరమ్ తేజకు మాంచి ప్లస్ అవుతుందంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సాయి ధరమ్ తన సినిమాల్లో భారీ ఎమోషన్ సీన్లు ఏవీ చేయలేదు. కానీ కృష్ణవంశీ సినిమా అంటే అవి కీలకంగా వుంటాయి.

నక్షత్రం సినిమాలో ఈ రెండు కాంబినేషన్లు సెట్ అయి, మాంచి ఎమోషన్ సీన్లు కొన్ని పండాయని వినిపిస్తోంది. అవి క్లిక్ అయితే, ఇకపై తేజు కూడా కాస్త బరువైన పాత్రలను ఎంచుకోవడానికి ధైర్యం చేస్తాడని టాక్. నక్షత్రం సినిమా 28న గౌతమ్ నందా, విఐపి 2 లాంటి హెవీ కాంపిటీషన్ మధ్య విడుదలవుతోంది.