Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ భాగమతికి ఏమయింది?

ఈ భాగమతికి ఏమయింది?

ఏనాడు క్లాప్ కొట్టారో భాగమతి సినిమాకు. అనుష్క హీరోయిన్ గా, అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా స్టార్ట్ చేసారు. యువి బ్యానర్, భారీ గ్రాఫిక్స్, అనుష్క ఇవి మాత్రమ ఆ సినిమాకు ఆకర్షణలు. కానీ ఖర్చు చూస్తే నలభై కోట్ల వరకు అయిందని వినికిడి. పిల్లజమీందార్ హిట్ మాత్రమే ఖాతాలో వున్న అశోక్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఎప్పటి నుంచో ఇదిగో విడుదల, అదిగో విడుదల అనుకుంటూ వార్తల్లో నానుతోంది. 

ఆఖరికి లేటెస్ట్ గా సంక్రాంతి బరిలోకి దిగుతుందేమో అన్న అనుమానం వుంది. ఎందుకంటే సంక్రాంతి బరిలోకి రావాల్సిన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా వాయిదా పడిపోయినట్లే. జనవరి మొదటివారంలో పవన్ సినిమా, మూడో వారంలో రజనీ సినిమా వున్నాయి.

ఇదిలా వుంటే భాగమతి గ్రాఫిక్స్ అవీ సరిగ్గా రాలేదని, క్వాలిటీ అప్ టు ది మార్క్ లేవని, అందుకే లేటు అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా సినిమా మేకింగ్  భారీగా వున్నా, డైరక్షన్ పరంగా కొన్ని సమస్యలు కనిపించాయని, ఈ విషయంలో యువి యూనిట్ డైరక్టర్ అశోక్ పై అసంతృప్తిగా వుందని తెలుస్తోంది. సో ఇప్పుడు ఇటు క్వాలిటీ గ్రాఫిక్స్, అటు సినిమాలో అడ్జస్ట్ మెంట్లు జరగాలి.

ఇప్పటిదాకా మహానుభావుడు పనుల మీద వున్నారు. సాహో పనీ స్పీడందుకుంది. మరి భాగమతిని పట్టించుకుని, స్పీడుగా రిపేర్లు పూర్తి చేసి, ఎప్పుడు భాగమతిని థియేటర్లలోకి తీసుకువస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?