Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ కాస్టింగ్ అంటే అదిరినట్లే

ఈ కాస్టింగ్ అంటే అదిరినట్లే

నటి సావిత్రి బయోపిక్ విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసారు. కీర్తి సురేష్ సావిత్రి పాత్రకు, సమంత ఓ రిపోర్టర్ పాత్రకు ఎంపికయ్యారు. లెటెస్ట్ బజ్ ఏమిటంటే అనుష్కను జమున పాత్రకు సెలెక్ట్ చేసారన్నది. అంతకు మించి మరో వార్త ఏమిటంటే, ప్రకాష్ రాజ్ ను జెమినీ గణేషన్ పాత్రకు తీసుకుంటున్నారని.

ఈ రెండు నిజమైతే అదుర్సే. ప్రకాష్ రాజ్ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తారు. పైగా అటు తమిళులకు, ఇటు తెలుగువారికి పరిచయమే. అనుష్క కూడా సేమ్ టు సేమ్. ఆల్రెడీ సెలక్ట్ చేసిన ఇద్దరు ఈ రెండు భాషల్లో నటించిన, నటిస్తున్న వారే. సో ఆ విధంగా రెండు భాషల్లో తయారవుతున్న సినిమాకు రెండు భాషలకు సంబంధించిన వారిని ఎంపిక చేయడం, అది కూడా క్రేజీ మల్టీస్టారర్ గా మార్చడం బాగుంది.

తెలుగు తమిళ రంగాలకు సుపరిచితమైన సావిత్రి బయోపిక్ ఈ విధంగా మాంచి రంజైన మల్టీస్టారర్ గా మారుతోంది. ఖర్చుకు తగిన ప్రతిఫలం వచ్చేలా నిర్మాతలు, దర్శకుడు నాగ్ అశ్విన్ బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?