Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ ఫీలర్ల వెనుక స్ట్రాటజీ ఏమిటి?

ఈ ఫీలర్ల వెనుక స్ట్రాటజీ ఏమిటి?

డ్రగ్స్ కేసులో ఎక్సయిజ్ అధికారులు కూడా చాలా తెలివిగా ఎత్తులు వేస్తున్నారు. నిత్యం భలే ఫీలర్లు వదులుతున్నారు. పోటా పోటీగా వార్తలు అందించాలన్న మీడియా బలహీనతను ఆధారం చేసుకుని, తన పరిశోధనకు పనికి వచ్చే విధంగా ఫీలర్లు వదులుతున్నట్లు కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న మరి కొంతమందికి నోటీసులు ఇస్తామని ఫీలర్లు వదిలారు. ఇలా నోటీసులు అందుకునే వారిలో టాలీవుడ్ కు చెందిన బడా బాబులు వున్నట్లు కూడా ఫీలర్లు వున్నాయి. నిన్నటికి నిన్న సాక్ష్యాలు దొరకకుండా సినిమా జనాలు జాగ్రత్త పడుతున్నారని ఫీలర్.

ఇప్పుడు తాజగా విచారణకు వచ్చిన వారందరి పేర్లు చార్జ్ షీట్ లో ఎంటర్ చేస్తారని ఫీలర్లు వదిలారు. అలా ఒక్క ఫీలర్ వదిలితే వేరే సంగతి. కానీ అలా వదలలేదు. అప్రూవర్ గా మారితే చార్జ్ షీట్ లో పేరు వుండదని మరో ట్యాగ్ లైన్ టైపు ఫీలర్.

ఇవన్నీ పరిశీలస్తుంటే, కావాలనే ఓ పద్దతి ప్రకారం వదుల్తున్నట్లు కనిపిస్తోంది. కాస్త అయోమయ పరిస్థితి క్రియేట్ చేసి, ఏదో విధంగా ఒకరిద్దర్ని అయినా అప్రూవర్ల కిందకు లాగగలగితే, కీలకమైన వారిని ఫిక్స్ చేయవచ్చన్న పోలీసు ఆలోచన దీనివెనుక కనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎక్సయిజ్ సర్కిళ్ల నుంచి వినవస్తున్న విషయాల ప్రకారం, మొత్తం సెలబ్రిటీల విచారణ పూర్తి అయిపోయే దాకా, కేసు ఏ దారిలో పయనిస్తుంది అనే విషయంలో అధికారులకే క్లారిటీలేదు. ఎందుకంటే విచారణ ఎదుర్కొంటున్న వారంతా బడా బాబులు. వీళ్ల తరపున వాదించేందుకు బడా లాయర్లు రెడీగా వుంటారు. పూర్తిగా, సమర్థవంతమైన సాక్ష్యాధారాలు లేకుండా వీళ్లను ఫిక్స్ చేయడం అంత సులువు కాదు. అలా జరగనపుడు ఇంత హడావుడి చేసినందుకు కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది. మిగిలిన వారిని విచారించినా అద్భుతాలు జరుగుతాయని ఏమీ అనుకోవడంలేదు. 

అందువల్ల ఆ విచారణ ముగిసే టైమ్ కు కనీసం ఒక్కరినయినా అప్రూవర్ గా మార్చాలన్న వ్యూహం కనిపిస్తోంది. కానీ సినిమా జనాలు ముదుర్లు. ఇప్పటికే వాళ్లు చాలా గట్టి లాయర్లతో సంప్రదింపులు జరిపి, ధీమాగా వున్నారు. అందువల్ల ఎవ్వరూ అప్రూవర్ గా మారే అవకాశంలేదు. అందుకే అందరిపై చార్జ్ షీట్ లు పెడతారు అనే ఫీలర్లు బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది.

చార్జ్ షీట్ లు పెడితే ఏమవుతుంది? ఏయే సెక్షన్ల కింద చార్జ్ షీట్ లు పెట్టడానికి అవకాశం వుంటుంది? స్టేషన్ బెయిల్ కు అవకాశం వుంటుందా? అసలు అరెస్ట్ లకు ఆస్కారం వుంటుందా? అన్నవి ఇఫ్పుడు ఇక లాయర్లతో డిస్కషన్ కు వస్తాయి. 

సెలబ్రిటీలు ఎలాగూ తమ పేర్లు పబ్లిక్ లోకి లాగేసారు కాబట్టి, అవసరం అయితే కోర్టుకు వెళ్లడానికి పెద్దగా జంకే అవకాశం లేదు. అప్రూవర్ గా మారినంత మాత్రాన కోర్టుకు వెళ్లకుండా వుండడానికి అవకాశంలేదు. అందువల్ల ఈ కొత్త ఫీలర్లకు అంత స్పందన వుంటుందని అనుకోనక్కరలేదు.

పోలీసలు ఎంత పకడ్బందీగా సాక్ష్యాధారాలతో చార్జ్ షీట్ లు పెట్టినా, చాలావరకు అవి ప్రాసిక్యూషన్ కు నిలవవని, కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. కలిసి ఫోటోలు దిగడం, అవతలి వాళ్ల దాంట్లో ఫోన్ నెంబర్లు వుండడం వంటివి సినిమావాళ్లకు వున్న క్రేజ్ ప్రకారం మరీ భయంకరమైన సాక్ష్యాలు కాదు. కాల్ రిజిస్టర్లు, అడియో రికార్డింగ్ లు ఇవన్నీ చాలా టైమ్ తీసుకునే వ్యవహారాలు. 

ఎటొచ్చీ కొన్నాళ్లు అవసరం అయితే కోర్టులకు వెళ్లడం తప్పకపోవచ్చు. ఇవీ న్యాయవాద సర్కిళ్లలో వినిపిస్తున్న మాటలు. సినిమా సెలబ్రిటీలకు డబ్బుల సమస్యలేదు. లాయర్ల సమస్య లేదు. అందువల్ల ఈ ఫీలర్లు వర్కవుట్ అవుతాయా అన్నది అనుమానం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?