Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ లాజిక్ మాటేమిటి హరీష్?

ఈ లాజిక్ మాటేమిటి హరీష్?

హరీష్ తో పవన్ కళ్యాణ్  మళ్లీ చాన్స్ ఇస్తాడన్న వార్తలు గుప్పు మన్నాయి. అదంతా గాలి వార్తలు తప్ప వేరు కాదని చెప్పేవాళ్లు చెబుతూనే వున్నారు. ఎస్ జె సూర్య, త్రివిక్రమ్ సినిమాల తరువాతి సంగతి. అంటే కనీసం రెండేళ్లు వేసుకోవచ్చు..పవన్ వర్కింగ్ స్టయిల్ ప్రకారం. ఆ సంగతి అలా వుంచితే, పవన్-హరీష్ శంకర్ సినిమా అన్న వార్తలు విన్న ఇండస్ట్రీ జనాలు భలే కామెంట్ చేస్తూ సింపుల్ లాజిక్ ఒకటి తీస్తున్నారు. 

పవన్ కు నిజంగా హరీష్ శంకర్ కు చాన్స్ ఇచ్చే ఉద్దేశం వుంటే గబ్బర్ సింగ్ 2 కే ఇచ్చి వుండేవాడు కదా? పోనీ సంపత్ నందికి చాన్స్ ఇచ్చాడు అనుకుందాం.. మార్చుదాం అనుకున్నపుడైనా హరీష్ గుర్తుకు రావాలి కదా? గబ్బర్ సింగ్ సక్సెస్ వెనుక హరీష్ శంకర్ పాత్ర ఎంత వుందో పవన్ కు తెలియదా? 

విజయంలో నిజంగా హరీష్ పాత్ర ఎక్కువగా వుండి వుంటే, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా హరీష్ ను పిలిచి చాన్స్ ఇచ్చేవాడుగా. అలా ఇవ్వలేదంటే..హరీష్ శంకర్ స్టామినాపై పవన్ కు నమ్మకం వున్నట్లా? లేనట్లా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?