Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ వ‌య‌సులో డ్యాన్స్‌లూ ఫైట్లూ ఎందుకంటే... చిరంజీవి

ఈ వ‌య‌సులో డ్యాన్స్‌లూ ఫైట్లూ ఎందుకంటే... చిరంజీవి

మెగాస్టార్ 150వ సినిమా చేయ‌డం ప‌క్కా. అది ఈ రోజో రేపో జ‌రిగేదే. తాజాగా 60వ బ‌ర్త్‌డే చేసుకున్న చిరంజీవి... 150కాదు 200వ సినిమా చేసినా ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టరు. అయితే కొంద‌రిలో ఉన్న అభిప్రాయం ఏమిటంటే... చిరంజీవి మ‌ళ్లీ న‌టించాల‌నే మేమూ కోరుకుంటున్నాం. కాని... ఇంకా కుర్రవేషాలేస్తే, డ్యాన్సులూ అవీ అంటే చూడ‌లేమేమో... అని. అలాగే కొంద‌రు సినీ విమ‌ర్శకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో ఒక ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఒక విలేక‌రి స్ట్రయిట్‌గా మెగాస్టార్‌నే ఈ ప్రశ్నవేశాడు. మిగిలిన చాలా మంది న‌టుల్లా మీరు కూడా ఎందుకు వ‌య‌సుకు త‌గ్గ పాత్ర ఎంచుకోకూడ‌దు?  అన్న ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ తానెందుకు అర‌వైలో ఇర‌వైలా చేయాల్సి వ‌స్తోందో వివ‌రించాడు. 

టాలీవుడ్ నుంచి నిష్క్రమించి రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయిన త‌న‌ను మ‌రోసారి సినిమా చేసేలా అభిమానుల ఆకాంక్షలు ప్రేరేపించాయ‌ని, సాక్షాత్తూ అమితాబ్ లాంటి సూప‌ర్‌స్టార్ 150వ సినిమా చేసి మీ అభిమానుల కోరిక తీర్చండి అని సూచించ‌డంతో మ‌రో సినిమాకు సిద్ధమ‌య్యాన‌న్నాడు చిరంజీవి. కేవ‌లం అభిమానుల కోరిక మేర‌కు చేస్తున్న సినిమా కాబ‌ట్టి, త‌న‌ను వారు ఎలా చూడాల‌నుకుంటున్నారో, త‌న నుంచి ఏమి ఆశిస్తున్నారో అవి ఇవ్వాల‌నే ఈ వ‌య‌సులో డ్యాన్స్‌లు, ఫైట్లకు సిద్ధమ‌య్యాన‌ని చెప్పాడు.

వాళ్ల కోసం చేయాల‌నుకుంటున్నారు స‌రే.. కాని ఒక‌ప్పటిలా డ్యాన్స్ లు ఇప్పుడు చేయ‌గ‌ల‌రా? అని ప్రశ్నిస్తే... అంత‌క‌న్నా బాగా చేయ‌గ‌ల‌ను. మా అబ్బాయి చ‌ర‌ణ్ తో కూడా పోటీప‌డేలా చేయ‌గ‌ల‌ను అంటూ ధీమా వ్యక్తం చేశాడు. త‌న 150వ‌ సినిమాలో హీరోయిన్ అవ‌కాశం ద‌క్కేది అనుష్క, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా,స‌మంత న‌లుగురిలో ఒక‌రికి అంటూ స్పష్టం చేశాడు చిరు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?